- Advertisement -
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో శనివారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు 70 శాతం పోలింగ్ నమోదైంది. కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తుండడంతో ఐదో విడత పోలింగ్ కోసం కట్టుదిట్టమైన ఏర్పట్లు చేశారు. ఓటర్లు మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని కోరుతున్నారు. చివరి గంటలో కరోనా బాధితులు ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. పశ్చిమబెంగాల్ లో 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఇప్పటివరకు నాలుగు విడతల్లో 159 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. శనివారం మరో 45 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, 342 మంది బరిలో ఉన్నారు. శనివారం కోటి మంది ప్రజలు ఓటేయనున్నారు. ఎన్నికల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
- Advertisement -