Saturday, December 21, 2024

70% పోలింగ్ ప్రశాంతం

- Advertisement -
- Advertisement -

పల్లెల్లో ఓట్ల జోరు

అత్యధికం 91.51%, అత్యల్పం యాకుత్‌పుర 39%

పట్టణాలకంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక ఓటింగ్

అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు

మొరాయించిన ఇవిఎంలు..

ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్ 

సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ముగింపు..
ఇతర ప్రాంతాల్లో సాయంత్రం 5గంటల వరకు క్యూ లైన్‌లో ఉన్నవారికి అవకాశం
ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి 10 గం. వరకు కొనసాగిన ప్రక్రియ
చింతమడకలో ఓటేసిన సిఎం కెసిఆర్ దంపతులు

ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

క్యూలైన్‌లో నిలబడి ఓటు వేసిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు

ఆదిలాబాద్ పట్టణంలో ఓటు వేయడానికి వచ్చి ఇద్దరు వృద్ధుల మృతి 

సిద్దిపేటలో ఓటు వేసి వెళ్తూ గుండెపోటుకు గురై మృతి చెందిన మరో వ్యకి

పటాన్‌చెరు మండలం కొండాపూర్‌లో పోలింగ్ అధికారి గుండెపోటుతో దుర్మరణం

గులాబీ కండువాతో వచ్చి ఓటేసిన మంత్రి ఐకె రెడ్డిపై కేసు

బెల్లంపల్లి ఎంఎల్‌ఎ దుర్గం చిన్నయ్యపైప్రతిపక్షాల ఆగ్రహం

అనేకచోట్ల బిఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ, లాఠీచార్జి

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలో సునీతా లక్షారెడ్డి తనయుడిపై కాంగ్రెస్ వర్గీయుల దాడి
మలక్‌పేటలో కాంగ్రెస్ అభ్యర్థిపై మజ్లిస్ దాడి

అగ్రనేతలు పోటీ చేసిన స్థానాల్లో భారీ పోలింగ్

ఇవిఎంలలో ఓటర్ల తీర్పు నిక్షిప్తం..

3న వెలువడనున్న ఫలితాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మూడు కోట్ల మంది ఓటర్ల తీర్పును ఈవిఎంలో నింక్షిప్తం చేశారు. గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు 70.06 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎ న్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మునుగోడు నియోజకవర్గంలో 91.51 శాతం, అత్యల్పంగా యాకుత్ పురా నియోజకవర్గంలో 39 శాతం నమోదైంది. 2018 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా శాతం నమోదు కా గా, ఈ సారి నమోదైంది. ఉదయం 7 గం టల నుంచి సాయంత్ర 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. సరిహద్దులోని మావోయిస్టు ప్రభావిత ప్రాం తాలై న 13 నియోజకవర్గాల్లో మాత్రమే సాయంత్రం 4 గంటలకే ముగిసింది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగింది. గడువులోగా వచ్చిన ఓటర్లను పోలింగ్ కేంద్రాల్లో వరుస లో ఉంచి ఓటు వేయించారు. కొన్ని చోట్ల గడువు ముగిసిన తరువాత వచ్చిన వారికి అనుమతి ఇవ్వలేదు. ఉద యం నుంచి మందకొడిగా పోలింగ్ జరగ్గా మధ్యాహం నుంచి ఓటర్లు పోటెత్తారు. నగరాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో మొదటి నుంచి పోలింగ్ నమోదు శాతం ఎ క్కువగా ఉంది. శేరిలింగంపల్లి , మహేశ్వరం ఆల్మాస్‌గూ డ, ఇబ్రహింపట్నంతో పాటు కొన్ని చోట్ల ఈవిఎంలు మొ రాయించడంతో ఆలస్యంగా ప్రారంభమైంది.

కేంద్రాల్లోకి సెల్‌పోన్లు అనుమతి లేకపోవడంతో కొంతమంది క్యూలైన్‌లో ఉండలేక, పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేక ఓటు వేయకుండా ఇంటికి తిరిగి వెళ్లారు. పోలింగ్ కేంద్రాలోకి వెళ్లే ముందు పోన్ డిపాజిట్ చేసే వెసులుబాటు కల్పించాలని పలువురు కోరారు. పలు ప్రాంతాల్లో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రికత్త చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి గుంపులను చెదరగొట్టి పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టారు. ఎన్నికల్లో మొత్తం 2290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో 2068 పురుషులు, 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్ పోటీ ఉన్నారు. పలుచోట్ల ఉ ద్రిక్తత పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. సూర్యాపేట జి ల్లాలోని మఠంపల్లిలో వ్యక్తిని చితకబాదిన బిఆర్‌ఎస్ కా ర్యకర్తలు గాయ పడటంలో ఆసుపత్రికి తరలింపు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్న ఖానాపూర్ మున్సిపాలిటీ వద్ద రెండు పార్టీ కార్యకర్తల మధ్య గొడవ లాఠీచార్జీ చేసిన పోలీసులు. జనగామ జిల్లా కేంద్రంలో ప్రెస్టన్ పాఠశాల వద్ద స్వల్ప ఉద్రిక్తత దీంతో ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. తాండూర్, నర్సాపూర్‌లో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మలక్‌పేటలో కాంగ్రెస్ అభ్యర్థి షేక్ అక్బర్‌పై మజ్లిస్ కార్యకర్తలు దాడి చేయగా పోలీసు లాఠీచార్జి చేసి కార్యకర్తలను చెదరగొట్టారు. వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం కరన్‌కట్ నగదు కలకలం కోటవీధిలో పోలింగ్ కేంద్ర వద్ద నగదు పంపిణీ పోలీసుల రాకతో డబ్బువదిలేసి పారిపోయిన గుర్తు తెలియని వ్యక్తులు. రూ. 7.45లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
డబ్బులిస్తే ఓటు వేస్తామన్న ఓటర్లు ఆగ్రహం
మహబూబాబాద్ జిల్లాలో విచిత్రమైన పరిస్దితి నెలకొం ది. డబ్బులిస్తే కానీ ఓట్లేయని ఓటర్లు నాయకులను డి మాండ్ చేసిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారిం ది. బయ్యారం మండలం సంతులాల్ పంచాయతీ పరిధిలోని ఎస్సీకాలనీ ఓటర్లు డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తాం, అంటూ తేల్చి చెప్పారు. దీంతో ఓటేయాలంటూ అధికారులు బతిమాలడంతో సాయంత్రం వచ్చి ఓట్లు వేశారు. మరో పక్క బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట మండలం వరిపేట గ్రామ ఓటర్లు పోలింగ్ బహిష్కరించారు. ఉద యం 11గంటల వరకు 20మంది మాత్రమే ఓట్లు వేశా రు. సమాచారం తెలిసిన అధికారులు గ్రామానికి చేరుకుని ప్రజలతో చర్చలు జరిపి ఓట్లు వేసేలా చేశారు.
అగ్రనేతల స్థానాల్లో భారీగా పోలింగ్ నమోదు
సిఎం కెసిఆర్, టిపిసిసి చీప్ రేవంత్ బరిలో ఉన్న కామారెడ్డిలో 68.94 శాతం పోలింగ్ నమోదైంది. కెసిఆర్ పో టీ చేస్తున్న గజ్వేల్ లో 76.17 శాతం పోలింగ్ నమోదైం ది. ఈటల బరిలో ఉన్న హుజురాబాద్ లో 70.23 శాతం ఓటింగ్, రేవంత్ పోటీ చేస్తున్న కొడంగల్ లో 70.50 శా తం ఓటింగ్ నమోదైంది. భట్టి విక్రమార్క పోటీ చేస్తున్న మధిరలో 70.30 శాతం ఓటింగ్, బండి సంజయ్ బరిలో ఉన్న కరీంనగర్ లో 64.17 శాతం పోలింగ్ నమోదైంది. ఉత్తమ్ బరిలో ఉన్న హుజూర్ నగర్ 74.11 శాతం పోలింగ్ నమోదుకాగా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తున్న నల్గొండలో 72.99 శాతం ఓటింగ్ నమోదైంది.
కుటుంబ సమేతంగా ప్రముఖులు ఓటు
ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దంపతులు సిద్దిపేట జి ల్లా చింతమడక, మలక్‌పేటలో త్రిపుర గవర్నర్ నల్లు ఇం ద్రసేనారెడ్డి, తెలంగాణ మంత్రులు హరీష్‌రావు సిద్దిపేట లో, అంబర్‌పేటలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కరీంనగర్ జ్యోతినగర్‌లో బండి సంజయ్‌కుమార్, హన్మకొండలో మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎస్‌ఆర్‌నగర్‌లో సీఈవో వికాస్‌రాజు, బంజారాహిల్స్‌లోని డిల్లీ స్కూల్‌లో రాష్ట్ర ఎ న్నికల కమిషన్ పార్థసారథి, తాండూర్‌లో మహేందర్‌రె డ్డి, నందినగర్‌లో తారక రామారావు, సూర్యాపేటలో జ గదీష్‌రెడ్డి, బోయిన్‌పల్లి మంత్రి మల్లారెడ్డి, గోదావరిఖనిలో కొప్పుల ఈశ్వర్ దంపతులు ఓటు వినియోగించుకున్నారు. కోడంగల్ ఉన్నత పాఠశాలలో టిపిసిసి చీప్ రేవంత్‌రెడ్డి, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్,తనయుడు అసదుద్దీన్ ఓటు వేశారు.
వేర్వేరు ఘటనలో నలుగురు మృతి
మన తెలంగాణ /ఆదిలాబాద్ ప్రతినిధి/పటాన్‌చెరు: అ సెంబ్లీ ఎన్నికల సందర్భంగా వేర్వేరు సంఘటనలో ము గ్గురు మృతి చెందారు. ఓటు వేసేందుకు వచ్చిన ఇద్దరు వృద్ధులతోపాటు, ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వచ్చి న అధికారికి గుండెపోటుతో రావటంతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే… ఆదిలాబా ద్ పట్టణంలోని భుక్తాపూర్ కాలనీకి చెందిన చంద్రగిరి రాజన్న (65) సంవత్సరాల వృద్ధుడు స్థానిక బాలికల హై స్కూలో ఓటు వేసేందుకు వచ్చి వరుసలో నిలబడ్డా డు. ఈ క్రమంలో కళ్ళు తిరిగి కిందపడిపోవటంతో సిబ్బంది గమనించి ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే చెందినట్లు వెల్లడించారు. స్థానిక మావల కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన తోకల గంగమ్మ (78) సంవత్సరాల వృద్ధురాలు ఓటు వేసేందుకు వరుసలో నిలబడగా ఫిట్స్ రావడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు తెలలిపారు.
ఇస్నాపూర్‌లో గుండెపోటుతో అధికారి మృతి
కొండాపూర్ వెటర్ని విభాగంలో పనిచేస్తున్న సుధాకర్ (48) అసెంబ్లీ ఎన్నికల విధుల్లో భాగంగా సంగారెడ్డి జి ల్లా పటాన్‌చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్ పోలింగ్ భూత్ నెంబర్ 248లో విధులు నిర్వహణ కోసం వచ్చా డు. అయితే గురువారం ఉదయం విధుల్లో భాగంగా పో లింగ్ బాక్సులను తనిఖీ చేసే క్రమంలో ఒక్కసారి కుప్పకూలడంతో వెంటనే సిబ్బంది పటాన్‌చెరు ప్రభు త్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టుగా తెలిపారు. ఎన్నిక విధులు నిర్వహణ కోసం వచ్చిన సహ ఉద్యోగి మృతి చెందడంతో సహ ఉద్యోగులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇదిలా ఉండగా సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని భూంపల్లి మండలం రుద్రారం గ్రామానికి చెందిన బాసస్వామి గత కొన్ని రోజులుగా జీవనోపాధి కోసం హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News