- Advertisement -
ఉగాండాకు చెందిన ఓ వృద్ధురాలు కవలలకు జన్మనిచ్చింది. రాజధాని కంపాలాలోని ఓ ఫెర్టిలిటీ సెంటర్ లో ఇన్ విట్రో ఫలదీకరణ(విఐఎఫ్) చికిత్స ద్వారా సఫీనా నముక్వాయా అనే 70 ఏళ్ల వృద్ధురాలుకు కవల పిల్లలుగా బాబు, పాప పుట్టారు. ప్రస్తుతం తల్లి, బిడ్డల ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అత్యంత పెద్ద వయసులో కవలలకు జన్మనివ్వడం ఒక మెరాకిల్ గా లోకల్ మీడియా పేర్కొంది. ఇది వైద్య విజయమని, సఫీనాను వైద్యులు అభినందించారు.
2020లోనూ సఫీనా ఐవీఎఫ్ ద్వారా ఓ కుమార్తెకు జన్మనిచ్చింది. దీంతో ఆఫ్రికాలోనే అత్యంత పెద్ద వయసులో తల్లైన మహిళగా సఫీనా రికార్డు సృష్టించింది.
కాగా, 2019లో ఇండియాలోనూ ఐవిఎఫ్ చికిత్స ద్వారా 73 ఏళ్ల ఓ వృద్ధురాలు కవలలకు జన్మనిచ్చింది.
- Advertisement -