Tuesday, December 17, 2024

28 ఏళ్ల కోడలిని పెళ్లాడిన 70 ఏళ్ల మామ

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. 70 ఏళ్ల మామ 28 ఏళ్ల సొంత కోడలిని వివాహం చేసుకున్నాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ విషయం తెలిసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. గోరఖ్‌పూర్ జిల్లా ఛపియా గ్రామంలో కైలాష్ యాదవ్ అనే అతనికి 12 ఏళ్ల క్రితం భార్య చనిపోయింది. అతనికి నలుగురు పిల్లలుండగా బర్హల్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో చౌకీదార్‌గా పని చేస్తున్న మూడో కుమారుడు కైలాష్ యాదవ్ కొంత కాలం క్రితం అనారోగ్యంతో చనిపోయాడు.

దీంతో అతని భార్య పూజ ఒంటరిగా మిగిలి పోయింది. ఇదిలా ఉండగా ఇటీవలే కైలాష్ యాదవ్ తన కోడలు పూజను స్థానికంగా ఉన్న గుళ్లో వివాహం చేసుకున్నాడు. పూజ నుదుట కైలాష్ సింధూరం దిద్దాడు. అనంతరం ఇరువురు దండలు మార్చుకున్నారు. అయితే ఈ విషయం తమకు కూడా ఈ మధ్యనే తెలిసిందని, అయితే వీరి వివాహంపై ఎవరు కూడా అధికారికంగా ఫిర్యాదు చేయలేదని బర్హల్‌గంజ్ స్టేషన్ ఇన్‌చార్జి చెప్పారు. ఏది ఏమయినా 70 ఏళ్ల వృద్ధుడు 28 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకోవడం మాత్రం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News