హైదరాబాద్ : అగ్నిపథ్ పథకానికి నిరసనగా ఆందోళనకారులు దేశవ్యాప్తంగా 60 రైళ్లకు నిప్పంటించారు… బిహార్‌లో 11 ఇంజిన్‌లను తగలబెట్టారు… దేశవ్యాప్తంగా గడిచిన మూడు రోజుల్లో మొత్తం 138 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా, 718 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 60 కోట్ల మంది ప్రయాణికులు తమ టిక్కెట్లను రద్దు చేసుకున్నారు… సీసీటీవీ, వీడియో ఫుటేజీల ద్వారా హింసకు పాల్పడుతున్న మరికొంత మందిని పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రైల్వే అధికారుల ప్రకారం.. ఒక జనరల్ బోగిని నిర్మాణానికి రూ. 80 లక్షలు ఖర్చు అవుతుంది. అదే స్లీపర్ కోచ్‌కు 1.25 కోట్లు, ఏసీ కోచ్ రూ. 3.5 కోట్లు ఖర్చు అవుతుంది. ఇక ఒక రైలు ఇంజిన్‌ను తయారు చేసేందుకు ప్రభుత్వం అక్షరాల రూ. 20 కోట్లకు పైగా వెచ్చిస్తోంది. మొత్తంగా చూసుకుంటే 12 బోగీల రైలును ఏర్పాటుకు చేసేందుకు రూ. 40 కోట్లు, 24 కోచ్‌ల ట్రైన్ నిర్మించేందుకు రూ. 70 కోట్లకుపైనే ఖర్చు చేస్తోంది.