Friday, December 20, 2024

సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి కోసం రూ.700 కోట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 21 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులకు ప్రధాని మోడీ ఆదివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్‌లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసైతో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.  2 వేల కి.మీలకు పైగా రైల్వేలైన్స్ కోసం రాష్ట్రంలో సర్వే చేశామని కిషన్‌రెడ్డి తెలిపారు.

సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి కోసం రూ.700 కోట్లు వెచ్చించామని, చర్లపల్లి రైల్వే టెర్మినల్ 2024లోపు పూర్తి చేస్తామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రూ.300 కోట్లతో కాచిగూడ రైల్వేస్టేషన్ అభివృద్ధిని చేస్తున్నామన్నారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ శంకుస్థాపనకు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దక్షిణమధ్య రైల్వే జిఎం అరుణ్‌కుమార్ జైన్, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ భరతేష్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News