- Advertisement -
ఠానేలో పెళ్లి వేడుకలో 700 మంది
ముంబై: మహారాష్ట్రలో పలు ప్రాంతాలలో కరోనా తీవ్రతరం అవుతూ ఉంటే ప్రజలు దీని పట్ల నిర్లక్షం వహిస్తున్నారు. మాస్క్‌లు లేవు. జనం గుంపులు గుంపులుగా చేరడం వంటి పరిణామాలు కొకొల్లలు అయ్యాయి. మహారాష్ట్రలోని ఠాణే జిల్లాలో ఈ నెల 10వ తేదీ రాత్రి ఓ పెళ్లి వేడుక జరిగింది. కల్యాణ్ ప్రాంతంలో షాదీ సంబరాలకు అత్యధిక సంఖ్యలో జనం వస్తున్నారని ఆలస్యంగా అధికారులకు తెలిసింది. మున్సిపల్ అధికారులు అక్కడికి వెళ్లి చూడగా దాదాపు 700 మంది మండపంలో ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఎవరికి మాస్క్‌లు లేవు. వేడుకలకు 50 మంది పరిమితిని అధికారులు ప్రకటించి ఉన్నప్పటికి పట్టించుకోకపోవడం, పెళ్లి అంతా మాస్క్‌లు లేకుండా మాస్‌గా జరగడంతో కంగుతిన్న అధికారులు పెళ్లి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.
- Advertisement -