- Advertisement -
న్యూఢిల్లీ : లోక్‌సభలో 700కు పైగా ప్రైవేటు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయాన్ని లోక్‌సభ సచివాలయం వెల్లడించింది. ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో అత్యధికం శిక్షాస్మృతి నిబంధనలు, ఎన్నికల చట్టాలకు సవరణలకు సంబంధించినవి. పలు బిల్లులను 2019 జూన్‌లో సభలో ప్రవేశపెట్టారు. కాగా కొన్నింటిని ఈ ఏడాది ఆగస్టులో వర్షాకాల సమావేశాలలో ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఉమ్మడి పౌరస్మృతి, లింగసమానత్వం, క్లైమెట్ మార్పులు, వ్యవసాయం వంటివాటికి సంబంధించి కూడా బిల్లులు సభ పరిశీలనకు వచ్చాయి. సాధారణంగా ప్రైవేటు బిల్లులు ఎప్పుడో కానీ ఓటింగ్ దశకు చేరుకోవు. కాగా వీటిపై చర్చ జరిగిన తరువాత సంబంధిత శాఖల మంత్రి దీనిపై స్పందించడం జరుగుతుంది. బిల్లు ఉపసంహరణను కోరడం జరుగుతుంది.
- Advertisement -