- Advertisement -
ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ లోని సహర్‌లాగున్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వాణిజ్య సముదాయ ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం సంభవించింది. ముందుగా రెండు దుకాణాల్లో మొదలైన మంటలు … అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ప్రమాద స్థలానికి చేరుకోకపోవడంతో పరిసరాలకు విస్తరించాయి. దీంతో మొత్తం 700 దుకాణాలు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. మొదట రెండు దుకాణాల్లో మంటలు అంటుకున్నాయని, రెండు గంటల తరువాత మిగతా దుకాణాలకు మంటలు వ్యాపించాయని స్థానికులు చెప్పారు. ఎగిసిపడుతున్న జ్వాలలను అదుపు చేయడంలో అగ్నిమాపక సిబ్బంది విఫలమైందని, అందుకే పెద్ద సంఖ్యలో దుకాణాలు దగ్ధమయ్యాయని స్థానికులు ఆరోపించారు.
- Advertisement -