Thursday, January 23, 2025

7000 కొనుగోలు కేంద్రాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి వరికోతలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బొటాబొటి ధరలకు అమ్మి నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి కెసిఆర్ యుద్ధ ప్రాతిపదికన యా సంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి, పౌర సంస్థ కమిషనర్ అనిల్ కుమార్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యల్లో భాగంగా సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించి ధాన్యం సేకరణ ప్రణాళిక అ మలుకు అవసరమైన కార్యాచరణ చర్యలు చేపట్టాలని సిఎం కేసిఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని ఆదేశించారు. ధాన్యం విక్రయాల్లో భాగంగా రై తులకు అందుబాటులో ఉండే విధంగా ఇదివరక టి లాగే ఏడు వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కోనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్‌కు సబంధించి 56.45లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగులోకి వచ్చింది. ముందుగా వరినాట్లు పడ్డ ప్రాంతాల్లో వరికోతలు కూడా ప్రారంభమయ్యాయి.

రైతులు కోసిన ధాన్యాన్ని విక్రయించేందకు మార్కెట్లకు తెస్తున్నారు. ఇదే అవకాశంగా తీసుకుని వ్యాపారులు చెప్పినంత తక్కవ ధరలకు ధాన్యం విక్రయించి నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోలు ప్రణాళికను సిద్దం చేసివుంచింది.ఈ సీజన్‌లో సుమారు కోటి40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో భాగంగా రైతుల తిండిగింజల అవసరాలు , ప్రైవేటు వ్యాపారుల కొనుగొలు తదితర అవసరాలకు సుమారు 50లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని అంచనావేసింది. రైతుల నుంచి కనీస మద్దతు ధరలతో ఈ సారి సుమారు 90లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక సిద్దం చేసింది. ఇందుకోసం రాష్ట్రమంతటా ఏడు వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రైతుల డిమాండ్, సౌలభ్యతను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయాలో ఇప్పటికే గుర్తించింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాక నిధుల చెల్లింపునకు కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం అవసరమైన నిధులనుకూడా సిద్దం చేసివుంచింది.

రైతుల బ్యాంకు ఖాతాలకే నిధులు నేరుగా జమ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. వరికోతలకు సంబంధించి అత్యధికంగా కోతమిషన్లపైనే రైతులు ఆధారపడుతున్నందున రాష్ట్రంలో అవసరమైనన్ని కోతమిషన్లు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకుంది. వరి కోసిన వెంటనే ధాన్యం ఆరబెట్టుకునేందుకు కల్లాలు ఏర్పాటు చేస్తోంది. అకాల వర్షాలు వాతావరణ ప్రతికూలతల వల్ల ధాన్యం కుప్పలు తడిసిపోకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచింది. ప్యాడీ క్లీనర్లు సిద్దం చేసివుంచింది.ఆరబెట్టిన ధాన్యాన్ని కేటాయించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరవేసేందుకు సుమారు 20కోట్ల గన్నీ సంచులు అవసరం అని అంచనా వేసి ఆ మేరకు గన్ని సంచులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టింది. మాయిశ్చర్ మిషన్లు, వేయింగ్ మిషన్లు సిద్దం చేసింది.

జియోటాగింగ్, వాహనాల లభ్యత, రవాణ, రైస్‌మిల్లుల అనుసంధానం తదితర ప్రక్రియపై ఇప్పటికే సంబంధింత శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించింది. యాసంగి ధాన్యం కోనుగోలు కార్యాచరణ ప్రణాళికను సమీక్షించేందుకు సోమవారం మరో మారు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని ఇదివరకే ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌రావు, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఈ సమావేశంలో పాల్గొని సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కొనుగోలు ప్రణాళికపై సమీక్షించనున్నారు. ఆదివారం ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు రా్రష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News