- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిన కొత్త 7 మెడికల్, నర్సింగ్ కాలేజీలకు 7007 పోస్టులు మంజూరయ్యాయి. ఒక్కో కాలేజీకి 1001 పోస్టుల చొప్పున నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ కె రామకృష్ణరావు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రోఫెసర్లు, వైద్యులు, టెక్నిషీయన్లు, ఫార్మసిస్టులతో పాటు ఇతర సహాయక సిబ్బందిని కూడా నియమించుకోవాలని ఆయన ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. కొత్త కాలేజీలతో పాటు జగిత్యాల, గాంధీ నర్సింగ్ కాలేజీలకూ పోస్టులు కేటాయించారు. ఒక్కో నర్సింగ్ కాలేజీకి 48 చొప్పున 720 పోస్టులకు అనుమతి ఇచ్చారు.
- Advertisement -