Sunday, December 22, 2024

దక్షిణాది సినిమా సూపర్ హిట్

- Advertisement -
- Advertisement -

70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి నామినేషన్లు అందాయి. 11 మందితో కూడిన జ్యూరీ ఈ చిత్రాలను పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించింది. ఉత్తమ నటుడిగా రిషభ్ శెట్టి (కాంతారాక న్నడ)కు దక్కింది. ఉత్తమ నటి పురస్కారానికిగానూ నిత్యామీనన్ (తిరు చిత్రాంబళంతమిళం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ గుజరాతి) ఇద్దరిని జ్యూరీ సంయుక్తంగా ఎంపిక చేసింది. జాతీయ ఉత్తమ చిత్రంగా ఆట్టమ్ (మలయాళం). ఉత్తమ దర్శకుడు సూరజ్ బర్జాత్యా
(ఉంచాయిహిందీ) ప్రకటించింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా తెలుగు నుంచి కార్తికేయ 2, ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియన్ సెల్వన్-1, ఉత్తమ కన్నడ చిత్రంగా కెజిఎఫ్-2 చిత్రాలు నిలిచాయి.

పురస్కార విజేతలు వీరే
ఉత్తమ చిత్రం : ఆట్టమ్ (మలయాళం)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు) : కార్తికేయ 2
ఉత్తమ నటుడు : రిషబ్ శెట్టి (కాంతారకన్నడ)
ఉత్తమ నటి : నిత్య మేనన్ (తిరుచిత్రాంబళంతమిళం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్‌గుజరాతి)
ఉత్తమ దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఉంచాయిహిందీ)
ఉత్తమ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్: కాంతార (కన్నడ)
ఉత్తమ దర్శకుడు (డెబ్యూ): ప్రమోద్ కుమార్, ఫౌజా (హరియాన్వీ)
ఉత్తమ విజువల్ ఎఫెకట్స్ సినిమా: బ్రహ్మాస్త్ర పార్ట్1: శివ (హిందీ)
ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: శ్రీపాథ్ (మలికాపురమ్‌మలయాళం)
ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి-హిందీ)

ఉత్తమ ఫిల్మ్ ప్రమోటింగ్ నేషన్, సోషల్, ఎన్విరాన్మెంటల్ వాల్యూస్: కచ్ ఎక్స్‌ప్రెస్ (గుజరాతీ)
ఉత్తమ సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజాహరియాన్వి)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: పొన్నియిన్ సెల్వన్ పార్ట్ -1 (తమిళం), సినిమాటోగ్రాఫర్: రవి వర్మన్
ఉత్తమ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ : బాంబే జయశ్రీ (చాయుమ్‌వెయిల్), సౌదీ వెల్లక్క సీసీ 225/2009
ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ : అర్జిత్ సింగ్ (కేసరియా) – బ్రహ్మాస్త్ర- పార్ట్ 1: శివ (హిందీ)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: కచ్ ఎక్స్‌ప్రెస్ (గుజరాతీ), డిజైనర్: నిక్కి జోషి
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : అపరాజితో, డిజైనర్: ఆనంద అద్య
ఉత్తమ ఎడిటింగ్: ఆట్టం, ఎడిటర్: మహేష్ భువనేండ్
ఉత్తమ సౌండ్ డిజైన్: పొన్నియిన్ సెల్వన్1 (తమిళం), డిజైనర్: ఆనంద్ కృష్ణమూర్తి
ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): ఆట్టంఆనంద్ ఏకార్షి,
డైలాగ్ రైటర్: గుల్మోహర్: అర్పితా ముఖర్జీ, రాహుల్ వి చిట్టెల

ఉత్తమ యాక్షన్ డైరక్షన్: అన్బరివు (కేజీయఫ్ 2)
ఉత్తమ కొరియోగ్రీఫీ: జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ తిరుచిత్రాంబళం (తమిళ్)
ఉత్తమ లిరిక్స్: ఫౌజా (హరియాన్వీ), రచయిత: నౌషద్ సదర్ ఖాన్
ఉత్తమ సంగీతం (పాటలు): బ్రహ్మస్త్ర: శివ (హిందీ) – ప్రీతమ్
ఉత్తమ సంగీతం (నేపథ్యం): పొన్నియిన్ సెల్వన్1(తమిళ్), సంగీత దర్శకుడు: ఏఆర్ రెహమాన్
ఉత్తమ మేకప్: అపరాజితో (బెంగాళీ), ఆర్టిస్ట్: సోమనాథ్ కుందు
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (ఒడియా): దమన్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (మలయాళం): సౌది వెళ్లక్క సీసీ 225/2009
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (మరాఠీ): వాల్వీ (ది టెర్మైట్)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (కన్నడ): కేజీయఫ్ 2
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (హిందీ) : గుల్మోహర్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (బెంగాళీ): కబేరి అంతర్దాన్
ఉత్తమ టివా ఫిల్మ్: సికాసిల్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తమిళం): పొన్నియిన్ సెల్వన్ – 1
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (పంజాబీ): బాగీ డి దీ
స్పెషల్ మెన్షన్: గుల్మోహర్ (హిందీ), నటుడు: మనోజ్ బాజ్పాయ్; కదికన్ (మలయాళం), సంగీత దర్శకుడు: సంజోయ్ సలీల్ చౌదురి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News