Saturday, December 21, 2024

ఆరోగ్యకర తిండి లేక భారతీయుల తిప్పలు

- Advertisement -
- Advertisement -

71% Indians Can't Afford A Healthy Meal

71 శాతం మంది ఆహారం అనారోగ్యకారకం
ఏటా 11 లక్షల మరణాలు
సిఎస్‌ఇ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ : దేశంలో 71 శాతం వరకూ భారతీయుల ఆరోగ్యకరమైన తిండికి నోచుకోలేకపోతున్నారు. దీనితో అనేక రకాల జబ్బులకు గురి అవుతున్నారని శాస్త్ర, పర్యావరణాల కేంద్రం (సిఎస్‌ఇ) డౌన్ టు ఎర్త్ మేగజైన్ తాజాగా వెలువరించిన నివేదికలో తెలిపారు. అనారోగ్యకర తిండితో ఏటా దాదాపు 11 లక్షల మంది అకాల మరణం చెందుతున్నారని నివేదికలో వెల్లడైంది. పేలవమైన తిండితో ఆరోగ్య అనర్థాలు తలెత్తుతున్నాయి. సరైన ఆహారం తీసుకోకపోవడంతో పలు రకాల ఆహార సంబంధిత ముప్పు పరిణామాలు తలెత్తుతున్నాయి, శ్వాస కోశ వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్, గుండెపోటు, కాలేయ జబ్బులు తలెత్తుతున్నాయని ‘ స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్వరాన్మెంట్ 2022 ః ఇన్ ఫిగర్స్ పేరిట నివేదిక వెలువడింది.

పండ్లు తక్కువ మాంసం ఎక్కువ
అధిక సంఖ్యలో భారతీయుల ఆహారంలో తక్కువగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఉంటున్నాయి. వీటికి బదులుగా వీరు ఎక్కువగా ఉడికించిన మసాలాలతో ధట్టించిన మాంసాహారం, చక్కెరతో కూడిన డ్రింకులు ఇతర పానీయాలు లాగిస్తున్నారు. ఇవి రుచికరంగా ఉంటున్నాయి, కానీ ఆ తరువాత అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయని వెల్లడైంది. అయితే దేశంలో 71 శాతం మంది భారతీయులు ఆరోగ్యకరమైన తిండికి ఖర్చు పెట్టే పరిస్ధితిలో లేరు. ఇది ప్రపంచ వ్యాప్తంగా చూస్తే సగటున 42 శాతంగా ఉంది. ఆరోగ్యకరమైన తిండికి సరైన ఆర్థిక వనరులు లేకపోవడంతో రుచికరంగా ఉండే చవక ధరల తిండికి అంతా అలవాటుపడటం తీవ్ర అనారోగ్య పరిస్థితిని తెచ్చిపెట్టిందని ఈ నివేదిక గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్టు 2021 ను ఉటంకిస్తూ తెలిపింది. చేపలు,పాలు పాల పదార్థాలు , నాణ్యమైన మాంసం తీసుకునే వారి సంఖ్య కూడా పరిమితంగానే ఉంది.

ఆదాయానికి ఆహారానికి లింక్‌లు
పరిపూర్ణతను సంతరించుకునే ఆరోగ్యకరమైన తిండికి వ్యక్తుల లేదా కుటుంబాల ఆదాయనికి సరైన లింకు దక్కడం లేదు. వ్యక్తుల ఆదాయానికి మించి 63 శాతం వరకూ వెచ్చిస్తే కానీ సరైన ఆరోగ్యకర తిండికి వీలు కాదని ఆహరం, వ్యవసాయ సంస్థ కూడా తెలిపింది. ఇక వయస్సుల వారిగా చూస్తే 20 ఏండ్లు అంతకు మించిన వయస్సు వారిలో కేవలం రోజువారిగా 35.8 గ్రాములు ఫలాలు తీసుకుంటున్నారు.ఈ వయోపరిమితి వారు నిజానికి రోజుకు కనీసం 200 గ్రాములు పండ్లు తీసుకోవాలి. ఇక రోజువారిగా ఈ వయస్సుల వారు కనీసం 300 గ్రాములు కూరగాయలు తీసుకోవాలి. కానీ వీరు ఇప్పుడు తీసుకుంటున్నది కేవలం రోజుకు 168 గ్రాములని తేలింది. ఇక అత్యధికులు సరైన స్థాయిలో బఠానీలు, చిక్కుడు వంటివి తీసుకోవడం లేదు. ఎన్ని సార్లు ఏ విధంగా ప్రయత్నించినా ఇప్పటివరకూ ప్రజలు సరైన రీతిలో ఆరోగ్యకరమైన ఆహారం పొందలేకపోతున్నారు. మరో వైపు అనారోగ్యకరమైన తిండి అలవాట్లు ప్రత్యక్షంగానే పర్యావరణానికి హానిని పెంచుతున్నాయి. ఇప్పటికే దేశంలో పౌష్టికాహార లోపాల పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే అనారోగ్యకర తిండి అలవాట్లు మనిషికి చేటు కల్గిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News