Thursday, January 23, 2025

భద్రాచలం ఎక్సైజ్ చెక్‌పోస్ట్ వద్ద 71 కేజీల గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / భద్రాచలం : ఎక్సైజ్ డిసి జి జనార్థన్‌రెడ్డి, ఎన్ఫోర్స్‌మెంట్ ఎసి ఎస్ జానయ్యల ఆదేశాల మేరకు ఏపీ, ఈఎస్ పోరిక కరమ్‌చంద్, కె తిరుపతిల ఆధ్వర్యంలో భద్రాచలం ఎక్సైజ్ చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించగా ఒక కారు, ద్విచక్ర వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న 71 కేజీల గంజాయిని పట్టుకుని 4గురిని అరెస్ట్ చేసినట్లు భద్రాచలం ఎక్సైజ్ సిఐ రహీమున్నీసాబేగం శనివారం తెలిపారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన కారు ఎపి 36ఆర్ 3033, హీరోహోండా ఓఆర్ 10 ఎఫ్7312 వాహనాలతో పాటు ఒడిస్సాకు చెందిన గణేష్‌ సికిందర్, క్రిష్ణప్రసాద్‌బైరాగి, హైదరాబాద్‌కు చెందిన ఎల్ మహేష్‌రెడ్డి, అమర్‌నాధ్‌పటేల్‌లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

నిందితుల వద్ద ఉన్న 4 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ గంజాయిని ఒడిస్సా రాష్ట్రం, మల్కాన్‌గిరిలో రూ. 1.5 లక్షలకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అధిక ధరకు అమ్మకానికి తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించారని ఆమె తెలిపారు. ఈ దాడులలో సిఐలు ఆర్ రాజు, ఎస్‌కె రహీమున్సీసాబేగం, ఎస్‌ఐలు ఎస్‌కె ముబషీర్ అహ్మద్, కె గౌతమ్, సిబ్బంది ఎమ్‌ఎ కరీం, జి బాలు, ఎల్‌ఆర్‌కె గౌడ్, ఎండి హబీబ్, కె సుధీర్, పి హరీష్, టి వెంకటేశ్వర్లు, వి హనుమంతరావు, కె గురవయ్య, సుమంత్, జి వెంకటనారాయణ పాల్గొన్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News