Wednesday, April 23, 2025

ఐదేళ్ల మనవరాలిపై 71 ఏళ్ల తాత అత్యాచారం

- Advertisement -
- Advertisement -

తన ఐదేళ్ల మనవరాలిపై అత్యాచారానికి పాల్పడిన ఒక 71 వృద్ధుడికి పోక్సో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. రాజస్థాన్‌లోని బరన్ నగరంలో నివసించే 71 సంవత్సరాల హీరాలాల్ 2022 అక్టోబర్‌లో తన ఇంట్లో ఐదేళ్ల మనవరాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని నేరం రుజువుకావడంతో యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ. 50 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం పోక్సో కోర్టు న్యాయమూర్తి సోనియా బేనీవాల్ తీర్పు చెప్పారు.

తన గదిలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన హీరాలాల్‌ను ఆ బాలిక తల్లి, మేనత్త పట్టుకున్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరినారాయణ్ సింగ్ తెలిపారు. హర్నావాడ షాజీ పోలీసు స్టేషన్‌లో బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హీరాలాల్‌పై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News