- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 71,365 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,24,10,976కు చేరింది. ఇందులో 5,05,279 మంది బాధితులు మృతిచెందగా, 8,92,828 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 4,10,12,869 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, గత 24 గంటల్లో 1,72,211 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడగా, 1,217 మంది మరణించారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 2.11 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 4.54 శాతానికి తగ్గిందని తెలిపింది.
- Advertisement -