Monday, December 23, 2024

నేపాల్ లో కూలిన విమానం: 45 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఖట్మాండూ: నేపాల్‌లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఖట్మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయల్దేరిన విమానం కుప్పకూలింది. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 72 మంది ఉన్నారు. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి విమానం బయలుదేరుతుండగా కుప్పకూలిపోయింది. వెంటనే మంటలు వ్యాపించడంతో చూస్తుండగానే విమానం కాలిపోయింది. 45 మంది మృతదేహాలను బయటకు తీశామని విమానయాన అధికారులు తెలిపారు. 72 మంది చనిపోయి ఉంటారని విమానయాన అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కరిని కూడా కాపాడలేదన్నారు. విమానంలో 50 మంది నేపాలీలు, ఐదుగురు భారతీయులు, నలుగురు రష్యాన్లు, ఇద్దరు కొరియన్స్, ఇరిస్, అర్జెంటీనా, ప్రెంచ్ దేశాలకు చెందిన ఒక్కొక్కరుగా ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు విమానం గంటకు 500 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News