Wednesday, January 22, 2025

బద్లాపూర్‌లో 72 మంది అరెస్టు.. ఇంటర్నెట్ సేవల నిలిపివేత

- Advertisement -
- Advertisement -

ఠాణె : మహారాష్ట్ర ఠాణె జిల్లాలోని బద్లాపూర్‌లో ఇద్దరు కిండర్‌గార్టెన్ బాలికలపై లైం గిక అత్యాచారంపై పెద్దఎత్తున నిరసనల నేపథ్యంలో పట్టణంలో బుధవారం ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసినట్లు, చాలా వరకు పాఠశాలలను మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. మంగళవారం బద్లాపూర్‌లో రైల్వే స్టేషన్‌లోను, ఇతర ప్రాంతాల్లోను రా ళ్లు రువ్విన సంఘటనల్లో కనీసం 17 మంది నగర పోలీస్ సిబ్బంది, ఎనిమిది మంది రై ల్వే పోలీసులు గాయపడినట్లు, దౌర్జన్యకాం డ సందర్భంగా 72మంది వ్యక్తులను దర్యా ప్తు అధికారులు అరెస్టు చేసినట్లు వారు తెలియజేశారు. అధికారుల సమాచారం ప్రకా రం, పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం అదనపు పోలీస్ బలగాలను మోహరించారు.

పట్టణంలో పరిస్థితి క్రమంగా మామూలు స్థాయికి చేరుకుంటున్నది. క్రితం వారం పాఠశాల వాష్‌రూమ్‌లో ఇద్దరు బాలికలపై పాఠశాల స్వీపర్ లైంగిక అత్యాచారం జరిపాడన్న ఆరోపణ నేపథ్యంలో వేలాది మంది నిరసనకారులు స్టేషన్‌లో రైలు పట్టాలను ఆక్రమించుకుని, పాఠశాల భవనంలో విధ్వంసం సృష్టించిన తరువాత మంగళవారం మొత్తం బద్లాపూర్ పట్టణం దాదాపుగా స్తంభించిపోయింది. లైంగిక అత్యాచా రం ఘటనపై నిరసనకారులు పోలీస్ సిబ్బందిపై రాళ్లు రువ్వి, పాఠశాల భవనంలో విధ్వంస కాండకు పాల్పడ్డారు. నిరసనకారులను చెదరగొట్టి, రైళ్ల రాకపోకలకు వీలు కల్పించేందుకు పోలీసులు వారిపై కేన్‌చార్జి చేశారు. డిసిపి సుధాకర్ పఠారె ‘పిటిఐ’తో మాట్లాడుతూ, నిరసనలు,దౌర్జన్యకాండ నేప థ్యంలో పట్టణంలో ఇంటర్నెట్ సర్వీసులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.

‘పట్టణం లో పరిస్థితిని సమీక్షించిన పిమ్మట ఇంటర్నెట్ సర్వీసుల పునరుద్ధరణ జరుగుతుంది’ అని ఆయన తెలిపారు. బుధవారం పట్టణం లో చాలా వరకు పాఠశాలలు మూతపడిన ట్లు స్థానికులు తెలియజేశారు. ‘ఇద్దరు బాలికలపై లైంగిక అత్యాచారంపై మంగళవారం బద్లాపూర్‌లో నిరసనల సమయంలో ఆగ్రహోదగ్రులైన జనం రాళ్లు రువ్వడంతో ఇద్ద రు అధికారులతో సహా కనీసం 17 మంది నగర పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. నిషేధాజ్ఞల ఉల్లంఘన, చట్టవిరుద్ధంగా సాయుధులుగా గుమిగూడడం, దౌర్జన్య సంఘటన లు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం వంటి ఆరోపణలను పురస్కరించుకుని దుండగులపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం’ అని బద్లాపూర్‌లో సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలియజేశారు. క్షతగాత్రులైన పోలీస్ సిబ్బంది వివిధ స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు.

‘రాళ్లు రువ్వడం, ఇతర నేరాల సందర్భంగా ఇంత వరకు మొత్తం 40 మందిని అరెస్టు చేయడమైంది. బద్లాపూర్ రైల్వే స్టేషన్‌లో హింసాకాండ సందర్భంగా ఒక ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. 32 మంది వ్యక్తులను అరెస్టు చేశాం’అని ప్రభుత్వ రైల్వే పోలీస్ (జిఆర్‌పి) కమిషనర్ రవీంద్ర శిస్వె వెల్లడించారు. ‘రాళ్లు రు వ్విన సంఘటనలో అధికారులతో సహా ఏడుగురు నుంచి ఎనిమిది మంది రైల్వే పోలీస్ సిబ్బంది గాయపడ్డారు’ అని ఆయన తెలిపారు. ‘బుధవారం పరిస్థితి మామూలుగా, అదుపులోనే ఉంది’ అని శిస్వె తెలిపారు.

నిందితుని తరఫున వాదించవద్దు
బద్లాపూర్ లైంగిక అత్యాచారం కేసులో అరెస్టయిన నిందితుని తరఫున వాదించవద్దని తన సభ్యులకు ఠాణె జిల్లాలోని కల్యాణ్ బార్ అసోసియేషన్ బుధవారం విజ్ఞప్తి చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News