Wednesday, January 22, 2025

దేశంలో కొత్తగా 7219 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Corona in India

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7219 కరోనా పాజిటీవ్ కేసులు నమోదుకాగా 25 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4.44 కోట్లకు చేరుకోగా 5.28 లక్షల మంది మరణించారు. గత 24 గంటల్లో 9651 మంది బాధితులు డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 4.38 కోట్లకు పైగా మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 56,745 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 213 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News