Monday, December 23, 2024

మళ్లీ 7 వేల పైగా భారీగా పెరిగిన కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

7240 new covid cases reported in india

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొన్నాళ్ల నుంచి నిత్యం నాలుగు వేల కొత్త కేసులు మాత్రమే వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య పెరుగుతోంది. వరుసగా రెండో రోజు 40 శాతం మేర పెరిగాయి. ముందు రోజు ఐదు వేలకు పైగా వచ్చిన కేసులు , నేడు 7 వేల మార్కు దాటేశాయి. క్రియాశీల కేసులు 28 వేల నుంచి ఒకేసారి 32 వేలకు పెరిగాయి. గురువారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం బుధవారం 3.40 లక్షల మందికి పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా, 7240 మందికి పాజిటివ్‌గా తేలింది. 94 రోజుల తరువాత మరోసారి 5 వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 2.13 శాతానికి చేరుకుంది.

మహారాష్ట్రలో 2701 మంది, కేరళలో 2271 మంది, వైరస్ బారిన పడ్డారు. మహారాష్ట్రలో జనవరి 25 తరువాత ఇవే ఒక్కరోజు అత్యధిక కేసులు. అక్కడ 42 శాతం కేసులు ఒక్క ముంబై లోనే బయటపడ్డాయి. ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఏ.5 ను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. కొత్త కేసులు పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు 32,498 కి చేరాయి. దాంతో క్రియాశీల రేటు 0.08 శాతంగా నమోదై ఆందోళన కలిగిస్తోంది. బుధవారం 3591 మంది కోలుకోగా, ఇప్పటివరకు 4.26 కోట్ల మందికి పైగా వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 98.71 శాతానికి తగ్గిపోయింది. 24 గంటల వ్యవధిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది ప్రారంభం నుంచి 194.59 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. బుధవారం ఒక్క రోజే 15.43 లక్షల మంది టీకా తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News