వయనాడ్ (కేరళ) : భారీ వర్షాలకు మంగళవారం తెల్లవారు జామున కేరళ వయనాడ్ జిల్లా మెప్పడి సమీపాన పర్వత ప్రాంతాల్లో పెద్ద కొండచరియలు విరిగి పడగా కనీసం 107 మంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరి 116 మంది గాయపడ్డారు. ఇంకా వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని ఆందోళన చెందుతున్నారు. నాలుగు గంటల వ్యవధిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలు మూడు వయనాద్‌ను కుదిపివేయగా ఎన్‌డిఆర్‌ఎఫ్, ఆర్మీ సహా పలు సంస్థలు రక్షణ, సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. చిక్కుకుపోయిన వారిని వెలుపలికి తీసుకురావడానికి రక్షణ బృందా లు అవిశ్రాంతంగా ప్రయత్నిస్తున్నారు. పోలీస్ శాఖ, అగ్నిమాపక దళం నుంచి విపత్తు స్పందన బృందాలను కూడా కేరళ ప్రభుత్వం నియోగించింది. తెల్లవారు జామున ఈ విపత్తు సంభవించడంతో ఇళ్లలో నిద్రలో ఉన్న వాసులు తేరుకోలేకపోయారు.
శిథిలాల కింద చిక్కుకుపోయినవారి నుంచి సాయం కోసం వినతులు వెల్లువెత్తాయి. పేరుకుపోయిన శిథిలాల గుట్టలు ఈ విపత్తు తీవ్రతకు అద్దం పడుతున్నాయి. రక్షణ, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారు నదులు, బురద లో నుంచి శరీర భాగాలను వెలికితీయడంతో ఈ దుర్ఘటనలో మృతుల కచ్చిత సంఖ్య నిర్ధారణ కష్టంగా మారిందని ఒక ప్ర తినిధి చెప్పారు. శరీర భాగాలు ఒకే వ్యక్తివా లేక పలువురివా అన్నది స్పష్టం కాలేదని ఆయన చెప్పారు, మృతుల్లో అనేక మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. కొండచరియలు విరిగిపడడం వల్ల ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిన ప్రాంతాల్లో ముందక్కై, చూరళ్‌మల, ఆట్టమల, నూల్‌పుళ గ్రామాలు ఉ న్నాయని అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడడం వల్ల గాయపడినవారిలో 70 మందికి పైగా వివిధ ఆసుపత్రుల్లో చేర్పించినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కె రాజన్ తెలియజేశారు. రక్షణ కార్యక్రమాల్లో భారతీయ సైన్యం సహాయాన్ని కేరళ ప్రభుత్వం కోరింది.
ప్రస్తుతం సాగుతున్న రక్షణ కార్యక్రమాల్లో చేయూత కోసం చెన్నైలోని 122 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ (టిఎ) నుంచి రెండవ కమాండ్ అధికారి నేతృత్వంలో 43 మంది సిబ్బందిని సమీకరించినట్లు రక్షణ శాఖ పిఆర్‌ఒ వెల్లడించారు. ఒక వైద్యాధికారి, ఇద్దరు జెసిఒలు, 40 మంది జవాన్లతో కూడాని ఆ బృందానికి బాధిత ప్రాంతంలో కీలక సహాయం అందించే సామర్థం ఉంది. మృతుల్లో జిల్లాలోని చూరల్‌మల పట్టణంలో ఒక బాలునితో సహా నలుగురు వ్యక్తులు ఉన్నారు. తొండెర్నాడు గ్రామంలో నేపాల్‌కు చెందిన ఒక కుటుంబంలో ఏడాది శిశువు మరణించినట్లు వయనాడ్ జిల్లా అధికారులు తెలిపారు. పొతుకల్ గ్రామం సమీపాన ఒక నదీ తీరం నుంచి ఐదేళ్ల బాలునితో సహా మూడు మృతదేహాలు వెలికితీసినట్లు అధికారులు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ దుర్ఘటన పట్ల విచారం వెలిబుచ్చారు.
తాను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాట్లాడినట్లు, రాష్ట్రానికి కేంద్రం నుంచి సాధ్యమైన సకల సహాయం అందజేస్తామని హామీ ఇచ్చినట్లు మోడీ తెలియజేశారు. కాంగ్రెస్ ఎంపి, లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా విజయన్‌తో మాట్లాడి, ఈ విపత్లు పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తక్షణం రక్షణ, సహాయ కార్యక్రమాలు చేపట్టాలని రాహుల్ పిలుపు ఇచ్చారు. కొండచరియలు విరిగిపడడం వల్ల కలిగిన నష్టం అంత ఇంత కాదు. అనేక ఇళ్లు ధ్వంసం అయ్యాయి. నదులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెట్లు కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. దీనితో రక్షణ, సహాయ కార్యక్రమాలకు విఘాతం కలుగుతోంది. వరద నీటిలో కొట్టుకుపోయిన వాహనాలు చెట్ల కొమ్మల మధ్య ఇరుక్కుపోయి కనిపిస్తున్నాయి.
అనేక
చోట్ల అవి నీట మునిగిపోయాయి.
34 మృతదేహాల గుర్తింపు: సిఎం విజయన్
ఉత్తర కేరళలోని వయనాడ్ జిల్లాలో పెద్ద ఎత్తున కొండచ రియలు విరిగిపడిన దుర్ఘటనలో 34 మృతదేహాలను గుర్తించి నట్లు, 18 మృతదేహాలను కుటుంబాలకు అప్పగించి నట్లు సిఎం తెలిపారు. వయనాడ్ జిల్లా పొతుకల్ గ్రామం లో చలియార్ నదిలో నుంచి 16 మృతదేహాలను వెలికితీసి నట్లు కూడా సిఎం తెలియజేశారు. అవే కాకుండా, అన్వేషణ, రక్షణ కార్యక్రమాలు సాగిస్తున్నవారు శరీర భాగాలను కూడా వెలికితీశారని ఆయన తెలిపారు. కొండచరియలు విరిగిపడిన మొదటి ఘటన తెల్లవారు జామున సుమారు 2 గంటలకు, రెండవది సుమారు 4.30 గంటలకు సంభవించాయని, ఫలి తంగా వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని, ఇంకా అనేక మంది నీటిలో కొట్టుకుపోయారని విజయన్ చె ప్పారు. జిల్లాలో 45 శిబిరాలు ఏర్పాటు చేసి సుమారు 3069 మందికి అక్కడ పునరావాసం కల్పించినట్లు తెలిపారు.
రెండు రోజుల సంతాపం
వయనాడ్ జిల్లాలోని విలయంలో 93 మంది ప్రాణాలు కోల్పోయిన తరువాత కేరళ ప్రభుత్వం మంగళ, బుధవారాల్లో అధికారికంగా సంతాప దినాలు ప్రకటించింది.
వయనాడ్‌ని తక్షణం ఆదుకోవాలలి: రాహుల్
కేరళ లోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి ఇప్పటి వరకు దాదాపు 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని , ఈ ఆపదలో కేంద్రం తక్షణ సాయం అందించాలని, బాధితు లకు నష్టపరిహారం పెంచాలని , పునరావాసం కల్పించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. మంగళవారం లోక్‌సభలో ఈ అంశంపై జీరో అవర్‌లో రాహుల్ మాట్లాడారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు ప్ర భుత్వం నుంచి స్పందన కోరారు. దీనిపై పార్లమెంటరీ వ్యవ హారాల మంత్రి కిరెన్ రిజ్జు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాట్లాడా రని, ఆ రాష్ట్రానికి సంబంధించిన మంత్రిని సహాయ కార్యక్ర మాలను పర్యవేక్షించాలని సూచించారని పేర్కొన్నారు. “ ఈరోజు ఉదయం వయనాడ్‌లో కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. 70 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. బాహ్య ప్రపంచంతో ముండకై గ్రామానికి సంబంధాలు తె పోయాయి. అక్కడ జరిగిన ప్రాణ, ఆస్తినష్టాలను అంచనా వేయాల్సి ఉంది. ” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
పూర్తిగా సహకరిస్తామని అమిత్‌షా భరోసా
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో కేంద్ర హోం మ్ంర తి అమిత్‌షా కొండచరియల విషాదంపై మాట్లాడారు. ఈ విపత్తు నివారణకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహాయాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. అంతకు ముందు అమిత్‌షా ఈ విషాద సంఘటనపై తీవ్ర సంతాపం వెలిబుచ్చారు.
స్టాలిన్ చేయూత
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన విపత్తులో బా ధితులను ఆదుకోడానికి తమిళనాడు ప్రభుత్వం సహాయ హస్తం అందించింది. సీఎం నిధుల నుంచి రూ. 5 కోట్లు విడుదల చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధికా రులను ఆదేశించారు.
రంగం లోకి ఆర్మీ
వయనాడ్‌లో వర్షాలతో కొండచరియలు విరిగి పడుతూనే ఉ న్నాయి. సహాయ చర్యల కోసం ఆర్మీ రంగం లోకి దిగింది. 225 మంది సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నా రు. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎంఐ 17 ,ఏఎల్ హెచ్ హెలికాప్ట ర్ల సేవలను వినియోగిస్తున్నారు. ఇంతలో వాతావరణ శాఖ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించడం ఆం దోళన కలిగిస్తోంది. ఈమేరకు రెడ్ అలర్డ్ జారీ అయింది.