Friday, November 22, 2024

ఫిలిప్పీన్స్‌లో వరద బీభత్సం.. 73మంది మృతి

- Advertisement -
- Advertisement -

73 People killed after floods in Philippines

మనీలా: ఫిలిప్పీన్స్ లోని దక్షిణ ప్రావిన్స్‌లో నల్గేయ్ తుపాను కారణంగా గత మూడు రోజులుగా భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించి కొండచరియలు విరిగి పడడంతో 73 మంది మరణించారు. దాదాపు 14 మంది గల్లంతయ్యారు. మరో 33 మంది గాయపడ్డారు. దక్షిణ మాగ్విండానావో ప్రావిన్స్ లోని కుసియాంగ్ గ్రామంలో ఆదివారం మట్టిపెళ్లల కింద ఇరుక్కుపోయిన దాదాపు ఇరవై మృతదేహాలను వెలికి తీయగలిగారు. మరో 80 నుంచి 100 మంది మట్టిపెళ్లల కింద ఇరుక్కుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మాగ్విండనావో ప్రావిన్స్ లోని మూడు నగరాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. నల్గేయ్ తుపాను కారణంగా సమర్ ప్రావిన్స్ లోని తూర్పు నగరమైన కాటమరాన్ నుంచి 180 కిమీ దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉంది. ఇది వాయువ్య దిశగా వేగంగా కదులుతోంది. గంటకు 85 కిమీ వేగంతో తుపాన్ గాలులు వీస్తున్నాయి.

73 People killed after floods in Philippines

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News