Friday, December 20, 2024

మిథిల..మురిసి మెరిసే

- Advertisement -
- Advertisement -

భద్రాచలం : దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో రేసు అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి భద్రాచలం చేరుకొని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. స్వామివారి కల్యాణం జరిగే మిథిలా స్టేడియంను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బుధవారం ఉదయం నుంచి భద్రాద్రి రామాలయం భక్తులతో పోటెత్తింది. వేల సంఖ్యలో భక్తులు రామయ్యను దర్శించుకొనేందుకు తరలి వస్తున్నారు. భద్రాచలం బ్రిడ్జ్‌సెంటర్ మొదలుకొని రామాలయం వరకు భక్తుల ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.

కళ్యాణం వీక్షించడానికి వచ్చే వివిఐపి, విఐపిల కోసం ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. రామాలయం చుట్టూ మిరిమిట్లు గొలిపే లైటింగ్ ఏర్పాటు చేశారు. కళ్యాణానికి వచ్చే భక్తులకు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లను సిద్ధం చేశారు. రేపు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సీతారాముల కల్యాణం వీక్షించడానికి భద్రాచలం రానున్నారు. ఇదిలా ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్‌పి డా. వినీత్, ఎండోమెంట్ కమిషనర్ అనిల్‌కుమార్‌లు ఏర్పాట్లను అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా పటిష్ట భద్రలను ఏర్పానటు చేసి దగ్గరుండి పరిశీలిస్తున్నారు.

భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం కోసం ప్రధాన కూడళ్లలో సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా తరువాత భద్రాచలంలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అధికారులు శ్రమిస్తున్నారు. ఇప్పటికే భక్తులు భద్రాద్రికి భారీగా చేరుకున్నారు. కల్యాణాన్ని పురస్కరించుకొని బుధవారం స్వామివారికి శాస్త్రోక్తంగా ఎదుర్కోలు ఉత్సవం జరిగింది.
పుష్కర మహా పట్టాభిషేకం
భద్రాచలం శ్రీ సీతా రామచంద్రమూర్తి దేవస్థానంలో శ్రీరామనవమి తర్వాత రోజు జరిగే పుష్కర మహా పట్టాభిషేకం ఈసారి విశిష్టతను సంతరించుకుంది. పన్నెండేళ్ల తర్వాత వచ్చే పుష్కర పట్టాభిషేకం విశిష్టత కలిగినదని పండితులు చెబుతున్నారు. పట్టాభిషేక మహోత్సవాన్ని కనులారా వీక్షించిన వారికి సకల దోషాలు తొలగి అష్టైశ్వార్యాలు సిద్ధిస్తాయని వైదికులు తెలిపారు. భద్రాచలం శ్రీరామనవమి తర్వాత రోజు వచ్చే.. పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ హాజరవడం ఆనవాయితీగా వస్తోంది. భద్రాద్రిలో దేవస్థానంలో తప్ప మరెక్కడా ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించక పోవడం మరో విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News