Monday, December 23, 2024

రాజ్‌పథ్‌లో ఘనంగా 73వ గణతంత్ర వేడుకలు..

- Advertisement -
- Advertisement -

73rd Republic day celebrations at Delhi Rajpath

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో 73వ గణతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విశిష్ట సేవలందించిన వారికి రాష్ట్రపతి పురస్కారాలు అందజేశారు. జ‌మ్మూక‌శ్మీర్‌కు చెందిన ఏఎస్ఐ బాబు రామ్‌ గత ఆగస్టులో ఉగ్రవాదుల కాల్పుల్లో అమరుడయ్యారు. ఆయన మరణానంతరం కేంద్ర ప్రభుత్వం అశోక్ చ‌క్ర పురస్కారాన్ని ప్రకటించింది. తాజాగా రాష్ట్రపతి చేతుల మీదుగా బాబు రామ్‌ కుటుంబ సభ్యలు అశోక్ చ‌క్ర పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం గణతంత్ర పరేడ్ ప్రారంభమైంది. వాయుసేన విన్యాసాలు, శకటాల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. ఈ వేడుకల్లో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు.

73rd Republic day celebrations at Delhi Rajpath

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News