Monday, December 23, 2024

నర్సాపూర్ లో 74 లక్షల నగదు పట్టివేత

- Advertisement -
- Advertisement -

నర్సాపూర్ : నర్సాపూర్- హైదరాబాద్ ప్రధాన రోడ్డు నర్సాపూర్ మల్లన్న ఆలయం చెక్ ఫోస్ట్ వద్ద, సిఐ షేక్ లాల్ మదర్ ఆధ్వర్యంలో, 2023 అసెంబ్లీ ఎన్నికల కోడ్ లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తున్న సందర్భంలో గురువారం ఉదయం 11 గంటల సమయంలో, టిఎస్ 09యుడి 6567, టాటా వాహనంలో 74 లక్షల రూపాయలను గుర్తించి స్వాధీనం పర్చు కున్నామని సిఐ తెలిపారు. వాహనంలో ఉన్న నర్రా శ్రీనివాస్ తండ్రి దుర్గయ్య (30) ఎటిఎం కస్టోడియన్గా పని చేస్తున్నట్లు

,శాలిపేట గ్రామం, శంకరంపేట, మెదక్ జిల్లా గారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. స్వాధీన పర్చుకున్న డబ్బులో 500 నోట్లవి 70 లక్షలు,100 నోట్లవి 4 లక్షలు గా మొత్తం 74 లక్షలుగా గుర్తించడం జరిగిందని, ఈ డబ్బుకు సంబందించి సరైన పత్రాలు లేనందున ఇట్టి డబ్బులను స్వాధీన పర్చుకోవడం జరిగిందని సిఐ షేక్ లాల్ మదర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో నర్సాపూర్ ఎస్‌ఐ శివకుమార్, చిలప్‌చెడ్ ఎస్‌ఐ ఎస్ కె మహబూబ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News