Friday, November 15, 2024

రోడ్ల నిర్మాణానికి రూ.744 కోట్లు విడుదల చేయాలి: నామా

- Advertisement -
- Advertisement -

744 crores need for road construction

ఢిల్లీ: సిఆర్ఐఎఫ్ కింద రూ.744 కోట్ల నిధులను విడుదల చేయాలని లోక్ సభ పక్షనేత నామా నాగేశ్వరరావు కోరారు. లోక్‌సభలో తెలంగాణ రాష్ట్ర రోడ్ల నిర్మాణంపై నామా నాగేశ్వర్ రావు ప్రశ్నించారు. 2021-22, 2022-23 ఆర్థిక ఏడాది కింద మంజూరైన రోడ్ల నిర్మాణాన్నీ పూర్తి చేసేందుకు నిధుల కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.  తెలంగాణ రోడ్డు రవాణా & రహదారుల శాఖ నుంచి మొత్తం 42 ప్రతిపాదనలు వచ్చాయని కేంద్రం తెలిపింది. సిఆర్ఐఎఫ్ పథకం వివిధ రోడ్ల నిర్మాణానికి రూ. 744 కోట్ల ప్రతిపాదనలు తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వానికి వచ్చాయని వివరించింది. మొదట 37 రోడ్ల పనులకు సంబంధించి రూ. 445.90 కిలో మీటర్లకు గాను రూ. 620 కోట్లు విడుదల చేస్తామని, మిగతా 5 ప్రతిపాదనలకు సంబంధించి రూ. 77.41 కిలోమీటర్లకు గాను తరువాత రూ. 124 కోట్ల నిధులు విడుదల చేస్తామని పేర్కొంది. రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి సిఆర్ఐఎఫ్ కింద నిధులను కేటాయిస్తామని, 2021-22 ఏడాదికి రూ. 262.19 కోట్లు కేటాయించామని,  2022-23 ఆర్థిక ఏడాదికి నిధులను కేటాయింపు అప్పుడే నిర్ణయిస్తామంది. సిఆర్ఐఎఫ్ పనుల కోసం బిఒఎస్ 2.63 % ప్రకారంగా తెలంగాణకు నిధుల కేటాయింపు జరుగుతుందని కేంద్రం వివరణ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News