Saturday, November 16, 2024

దేశ వ్యాప్తంగా ఘనంగా 74వ గణతంత్ర వేడుకలు…

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కర్తవ్య పథ్ వద్ద గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్య పథ్ వద్ద రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకావిష్కరణ చేశారు. కర్తవ్య పథ్ వద్ద గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి దంపతులు, కేంద్రమంత్రులు, తదితరులు హాజరయ్యారు. గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి హాజరయ్యారు. కర్తవ్యపథ్‌లో గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. విజయ్ చౌక్ నుంచి ఎర్రకోట వరకు జవాన్లు కవాతు నిర్వహించారు. పరేడ్ తిలకించేందుకు 45 వేల మంది సందర్శకులు వచ్చారు. ఈ వేడుకల్లో రక్షణ శాఖ శకటాలు అబ్బురపరిచాయి. సందర్శకులను సైనిక, నావిక, విమానయాన శకటాలు అలరించాయి. ఈ వేడుకల్లో ఎపి శకటం కోనసీమ ప్రబల తీర్థం ఆకట్టుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News