Saturday, November 23, 2024

74వ భారత గణతంత్ర దినోత్సవ రిహార్సల్స్!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగాన్ని 1950లో ఆమోదించిన నేపథ్యంలో,  2023 జనవరి 26న భారత 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో అందుకు సన్నద్ధతలు మొదలయ్యాయి. నవీకరించిన కర్తవ్య పథ్(ఇదివరలో రాజ్‌పథ్ అనేవారు)లో గణతంత్ర దినోత్సవ వేడుకల రిహార్సల్స్ జరిగాయి. ఆ రోడ్డు నడవ ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉంటుంది.

ఈ కవాతు భారత సైనిక శక్తి పాటవాన్ని, దేశ సంస్కృతి వైభవాన్ని చాటుతాయి. ఈ రిహార్సల్స్ సందర్భంగా భారత యుద్ధ విమానాలైన జాగ్వార్ విమానాలను ఓ పద్ధతిలో ఆకాశంలో నడిపారు. భారత వైమానిక దళానికి చెందిన సి130 హర్య్యూల్స్, నాలుగు రాఫెల్ జెట్ విమానాలను కూడా ఓ ఫార్మేషన్‌లో నడిపారు. పంజాబ్ పోలీస్ సిబ్బంది కూడా రిహార్సల్స్‌లో పాల్గొన్నారు. పూర్తి వీక్షణం కోసం 26 జనవరి వరకు వేచి ఉండండి!

rehearsal 2

rehearsal 3

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News