- Advertisement -
సిరియా నుంచి భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా 75 మంది భారత పౌరులను డమాస్కస్ నుంచి లెబనాన్‌కు సురక్షితంగా తీసుకొచ్చింది. మొత్తం 75 మంది భారతీయుల్లో 44 మంది జమ్ముకశ్మీర్‌కు చెందిన జైరిన్ (యాత్రికులు) ఉన్నారని మంత్రిత్వశాఖ వెల్లడించింది.వారంతా వాణిజ్య విమానాల ద్వారా లెబనాన్ నుంచి త్వరలోనే స్వదేశానికి చేరుకోనున్నట్టు పేర్కొంది. ఇంకా అనేక మంది భారతీయులు సిరియాలో ఉన్నారని తెలిపింది. వారంతా డమాస్కస్ లోని రాయబార కార్యాలయంతో +963 993385973 వాట్సప్‌లో, hoc.damascus@mea.gov.in ఇ మెయిల్ ద్వారా టచ్‌లో ఉండాలని పేర్కొంది.
- Advertisement -