Wednesday, January 15, 2025

73 లక్ష‌ల మొబైల్ క‌నెక్ష‌న్లు ర‌ద్దు, ఎందుకంటే…!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:  టెలికామ్ కంపెనీలు రీవెరిఫికేషన్ ద్వారా 73 లక్షల మొబైల్ కనెక్షన్లను రద్దుచేసినట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం లోక్ సభలో తెలిపారు. నకిలీ ఐడీలు లేదా అడ్రస్ లతో తప్పుడు కనెక్షన్లను పొందినవారిని గుర్తించేందుకు ఓ వ్యవస్థను రూపొందించారు.

‘‘ ఇప్పటి వరకు 81 లక్షల అనుమానిత మొబైళ్లను ‘డాట్’ గుర్తించింది. వాటిలో 73 లక్షల మొబైల్ కనెక్షన్లను రీవెరిఫికేషన్ లో గుర్తించి రద్దు చేశాం’’ అని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లోక్ సభలో లిఖితపూర్వక సమాధానం ద్వారా తెలిపారు. నిర్ణీత పరిమితిని మించి కనెక్షన్లు ఉన్నవారిని కూడా గుర్తించి డిస్ కనెక్ట్ చేశారు. ఇలా 16 లక్షల మంది ఈ నిర్ణీత పరిమితిలోకి వచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News