Saturday, December 21, 2024

ప్రశాంతంగా గ్రూప్-1

- Advertisement -
- Advertisement -

Munugode by poll: TRS Party petition in High Court

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో గ్రూ ప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లోని 1019 కేంద్రాల్లో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. 75శాతం మంది అభ్యర్థు లు పరీక్షకు హాజరయ్యారని టిఎస్‌పిఎస్‌సి తెలిపిం ది. 503 పోస్టులకు గాను 3.80 లక్షల మంది అ భ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షా కేంద్రాల నుంచి వచ్చిన ప్రాథమిక నివేదికల ప్రకారం పరీక్ష కు 2,86,051 మంది (75 శాతం) హాజరయ్యా రు. పూర్తి నివేదికలు అందిన తర్వాత తుది గణాంకాలుతెలియజేయనున్నట్లు వెల్లడించారు. ఉద యం 8.30 గంటల నుంచి 10.15 గంటల వరకు అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల బయో మెట్రిక్ హాజ రు తీసుకున్నారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహిచేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని రకాల చర్య లు తీసుకుంది. ప్ర తి జిల్లాకు జిల్లా కో ఆర్డినేటర్లు, పరీక్ష నిర్వహణ, పర్యవేక్షణకు మొత్తం 1019 కేంద్రాలకు సిట్టింగ్ స్కాడ్‌లను నియమించింది. 61మంది అనుసంధాన అధికారులను నియమించింది. పరీక్షల నిర్వహణను పర్యవేక్షించడానికి టిఎస్‌పిఎస్‌సి కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షల ప్రత్యక్ష నిర్వహణను క మాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సమీక్షించారు. ఎనిమిది రోజుల్లో ఓంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని, స్కానింగ్ ప్రక్రియ పూర్తి కాగానే ప్రాథమిక కీని విడుదల చేయనున్నట్లు పబ్లిక్ సర్వీ స్ కమిషన్ వివరించింది. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినందుకు టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ డా. బి. జనార్దన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లను అభినందించారు. కలెక్టర్లు, పోలీసు అధికారులు, ఆర్‌డిఓలు, తహసీల్దార్లు, చీఫ్ సూపరింటెండెంట్‌లు, లైజన్ ఆఫీసర్లు, ఇతర అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేశారని ప్రశంసించారు.
సకాలంలో ఎగ్జామ్ సెంటర్ వద్దకు చేర్చిన ట్రాఫిక్ పోలీసు..
గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఎగ్జామ్ సెంటర్ విషయంలో పోరపడిన ఓ యువతి.. ట్రాఫిక్ పోలీసులు సకాలంలో ఆమె పరీక్ష రాయాల్సిన పరీక్ష కేంద్రం వద్దకు చేర్చారు. వివరాల్లోకి వెళితే గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం వచ్చిన ఓ యువతి పొరపాటున వేరే సెంటర్‌కు వెళ్లారు. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత తాను పొరబడినట్టుగా తెలుసుకున్న యువతి తన సెంటర్ కి ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. అయితే ఎగ్జామ్ సెంటర్కు ఇబ్బంది పడుతున్న యువతిని ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ పోలీసు ఒకరు తన వాహనంపై సకాలంలో ఎగ్జామ్ సెంటర్‌కు చేర్చారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఆ పోలీసును అభినందిస్తున్నారు.

75 Percent attendance for Group-1 Exam in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News