అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆరు పోర్టులే కాకుండా మరో నాలుగు పోర్టులు నిర్మిస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రాయాయపట్నం పోర్టు పనులకు సిఎం జగన్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోర్టు రావడానికి సహకరించిన గ్రామాలకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో మిగిలిన పోర్టులకు కూడా భూమి పూజా చేస్తామన్నారు. రామాయపట్నం పోర్టుతో ఎంతో ప్రయోజనం ఉందన్నారు. పోర్టు రావడంతో ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతోందని, పోర్టులతో పారిశ్రామిక రంగం ఉపందుకోవడంతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వివరించారు. పరోక్షంగా చాలా మందికి ఉపాధి లభిస్తుందన్నారు. తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు, నాలుగు పోర్టుల పనులను వేగవంతం చేశామని, ఫిషింగ్ హార్భర్ల ద్వారా లక్ష మంది మత్సకారులు ఉపాధి పొందుతారని, భూసేకరణ, డిపిఆర్ లేకుండా గత ప్రభుత్వం శంకుస్థాపన చేసిందన్నారు. పోర్టులో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామని, 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తెచ్చిన ప్రభుత్వం మనది గొప్పగా చెప్పారు.