Sunday, December 22, 2024

వచ్చే పదేళ్లలో మరో 75 వేల మెడికల్ సీట్లు

- Advertisement -
- Advertisement -

అమిత్ సా వెల్లడి

అహ్మదాబాద్: దేశంలో ఆరోగ్య రక్షణ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రానున్న 10 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా కొత్తగా 75,000 మెడికల్ సీట్లను జతచేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకించారు. నగర శివార్లలోని అదాలజ్ గ్రామంలో శుక్రవారం ట్రస్టు ఆధ్వర్యంలో నడిచే హీరామణి ఆరోగ్యధామ్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ ఆరోగ్య రక్షణ రంగం కోసం ఆరోగ్యకరమైన దృక్పథాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అవలంబిస్తున్నారని తెలిపారు. అనేక వ్యాధులను నిర్మూలించేందుకు పరిశుభ్రతా కార్యక్రమంగా స్వచ్ఛతా అభియాన్‌ను మోడీ మొదట ప్రారంభించారని, అనంతరం స్వచ్ఛమైన తాగునీరును సమకూర్చడం, ప్రతి ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణంపై ఆయన దృష్టిని సారించారని షా చెప్పారు.

ఆ తర్వాత యోగాను ప్రజలకు చేరువ చేసి రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్సను అందచేసే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టారని ఆయన చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని పటిష్టంగా అమలు చేయడం కోసం ప్రాథమిక, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను అభివృద్ధి చేయడంతోపాటు దేశవ్యాప్తంగా కొత్త వైద్య కళాశాల ఏర్పాటుపై దృష్టిని నిమగ్నం చేశారని ఆయన చెప్పారు. ప్రతి వైద్య కళాశాలకు అనుబంధంగా 14 విభాగాలతో కూడిన ఆసుపత్రి ఉంటుందని, ఇప్పుడు దేశవ్యాప్తంగా రానున్న 10 ఏళ్లలో మరో 75,000 మెడికల్ సీట్లు అందించాలని లక్షం పెట్టుకున్నామని ఆయన తెలిపారు. చవక ధరలకు మందులను అందించేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ స్టోర్లను ఏర్పాటు చేయడం కూడా ప్రభుత్వ విధానంలో భాగమని ఆయన చెప్పారు. 140 కోట్ల మంది ప్రజల ప్రయోజనం కోసం మోడీ ప్రభుత్వం 37 విభిన్న పథకాలను ప్రారంభించి అమలు చేస్తోందని అమిత్ షా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News