- Advertisement -
న్యూఢిల్లీ : దేశం నలుమూలాల రైల్వే అనుసంధాన ప్రక్రియలో భాగంగా 75 వందే భారత్ రైళ్లు నిర్వహిస్తారు. ఈ విషయాన్ని పంద్రాగస్టు ప్రసంగంలో ఆదివారం ప్రధాని మోడీ తెలిపారు. దేశ అమృత్ మహోత్సవంలో 75 వారాలలో ఈ 75 రైళ్లను నడిపించడానికి నిర్ణయించినట్లు దీనితో పలు మారుమూల ప్రాంతాలు నలుమూలల అనుసంధానం అవుతాయని చెప్పారు. ఇక పౌరవిమానయానంలో భాగంగా చేపట్టిన ఉడాన్ స్కీంతో సత్పలితాలు ఏర్పడుతున్నాయని, పలు ప్రాంతాల్లో అత్యంత వేగంగా కొత్త విమానాశ్రయాల ఏర్పాటు జరుగుతోందని ప్రధాని వివరించారు.
75 Vande Bharat trains in the country
- Advertisement -