Friday, November 22, 2024

గ్రామ స్థాయిలో 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు

- Advertisement -
- Advertisement -
75 years of independence celebrations at village level
నిర్వహించాలని బిజెపి ఎంపిలకు ప్రధాని మోడీ సూచన

న్యూఢిల్లీ : స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బిజెపి ఎంపిలు తమ నియోజక వర్గాల్లో ప్రతి గ్రామంలో కార్యక్రమాలు చేపట్టాలని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మంగళవారం ప్రధాని నరేంద్రమోడీ సూచించారు. 75 వ స్వాతంత్య్ర వార్షికోత్సవాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంలా పరిగణించకుండా ప్రజా ఉద్యమంగా, ప్రజాభాగస్వామ్యంతో నిర్వహించాలని ప్రధాని సూచించినట్టు సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ మీడియాకు చెప్పారు. పార్లమెంటులో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా విపక్షాలు సిద్ధంగా లేవని కూడా ప్రజలకు తెలియచేయాలని ప్రధాని సూచించినట్టు తెలిపారు.

ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఇద్దరు బిజెపి కార్యకర్తలతో బృందాన్ని ఎంపిలు ఏర్పాటు చేయాలని, వారి ద్వారానే కార్యక్రమాలు నిర్వహింప చేయాలని సూచించినట్టు చెప్పారు. 2047 నాటికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తి కానున్నందున అప్పటికి భారత్ ఎలా ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారో వారి నుంచి అభిప్రాయాలు, సూచనలు గ్రహించాలని మోడీ సూచించారని చెప్పారు. బిజెపి కార్యకర్తల బృందాలు ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో 75 గ్రామాలను సందర్శించాలని, అలాగే ప్రతినియోజక వర్గంలో 75 గంటలు గడపాలని మోడీ సూచించారని మంత్రి తెలియచేశారు. స్థానిక కీడా కార్యక్రమాలను, పరిశుభ్రత కార్యక్రమాలను ఈ సందర్బంగా నిర్వహించాలని మోడీ సూచించారు. గ్రామాల ప్రజలు డిజిటల్ సాంకేతిక విద్యను అలవర్చుకోవాలని, దీనివల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలను బీలైనంతవరకు గరిష్ఠంగా ఉపయోగించుకోడానికి వీలవుతుందని మోడీ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News