సుప్రీం కోర్టుకు సోమవారంతో 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవ ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా సారథ్యం వహిస్తూ, 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా, ప్రపంచంలో అత్యంత చైతన్యమంతమైన సర్వోన్నత న్యాయస్థానంగా రూపుదిద్దుకున్న ‘సిసలైన ప్రజా న్యాయస్థానం’ ఇది అని అభివర్ణించారు. ‘ఒక ఫెడరల్ కోర్టు వారసురాలుగా 1950లో ప్రస్థానం మొదలు కాగా, ప్రపంచంలోనే అత్యంత చైతన్యమంతమైన, పటిష్ఠమైన సర్వోన్నత న్యాయస్థానంగా ఇది రూపుదిద్దుకొంది. ప్రపంచ వేదికపై మన సుప్రీం కోర్టును నిలిపేది ఏమిటంటే సిసలైన ప్రజా న్యాయస్థానంగా దీని విశిష్ట లక్షణం’ అని ఆయన పేర్కొన్నారు. దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు 1950 జనవరి 26న సర్వోన్నత న్యాయస్థానం అస్తిత్వం మొదలైంది. కోర్టు ఆ తరువాత 28న ప్రారంభోత్సవం జరిగింది.
ఇది ఆదిలో పాత పార్లమెంట్ భవనంలో పని చేసి, 1958లో తిలక్ మార్గ్‌లోని ప్రస్తుత భవనానికి మారింది. రాజ్యాంగ ప్రస్థానం మొదలైన తరువాత గడచిన 75 ఏళ్లలో సుప్రీం కోర్టు పరివర్తన చెందిందని, అయినా తన పునాది ధ్యేయం మార్చుకోలేదని జస్టిస్ ఖన్నా చెప్పారు. ‘ఈ పరివర్తన ప్రగాఢ గుర్తింపును ప్రతిబింబిస్తున్నది న్యాయం సూత్రప్రాయంగాను, ఆచరణాత్మకంగాను ఉండాలన్నది. ఆ విధంగా వ్యవహరించడంలో ఇది కోట్లాది మంది భారతీయుల సజీవ వాస్తవికత సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే రాజ్యాంగబద్ధ వాగ్దానాన్ని ప్రతిబింబిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ప్రస్థానం హక్కుల్లో గణనీయమైన మార్పును ప్రతిబింబిస్తుండగా, మూడు సవాళ్లు ప్రధానంగా దృష్టిని ఆకర్షించాయని సిజెఐ చెప్పారు. ‘మొదట, బకాయీల భారం న్యాయాన్ని ఇప్పటికీ జాప్యం చేస్తోంది. రెండవది, పెరుగుతున్న దావా ఖర్చులు అసలు అందుబాటుకు ముప్పు తెస్తున్నది.
మూడవది, బహుశా అత్యంత ప్రాథమికమైనది అసత్యాన్ని ఆచరించినప్పుడు, ఆ ప్రదేశంలో న్యాయం మనజాలదు’ అని సిజెఐ ఖన్నా అన్నారు. ఈ సవాళ్లు న్యాయ సాధనలో తదుపరి సరిహద్దుగా మారాయని ఆయన అన్నారు. సుప్రీం కోర్టు వజ్రోత్సవ సంవత్సరం సందర్భంగా సమావేశమైన ఉత్సవ ధర్మాసనంలో సిజెఐ కూడా ఉన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ప్రజలకు అందుబాటులోనే. ఈ కోర్టు గదుల్లో విభిన్న న్యాయమూర్తులతో అందుబాటులో ఉంటున్నదని సిజెఐ ఖన్నా తెలిపారు. సుప్రీం కోర్టు 75 ఏళ్ల ప్రస్థానం గురించి ఖన్నా ప్రస్తావిస్తూ, కోర్టు న్యాయ మీమాంసలో ప్రతి దశాబ్ది పలు మైలురాయి తీర్పులతో మన దేశంలో ఎదుర్కొన్న సవాళ్లకు ప్రతీకగా నిలిచిందని తెలియజేశారు.