Sunday, January 19, 2025

756 వాహనాల వేలానికి సిద్ధం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  వివిధ సందర్భాల్లో సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులు పరిశీలించుకోవాలని కోరారు. సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్న 756 వాహనాలను మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో పార్కింగ్ చేశారు. వీటిని పోలీసులు త్వరలోనే వేలం వేయనున్నారు. ఆయా వాహనాల యజమానులు www.cyberabadpolice.gov.inలో వాహనాల వివరాలను తెలుసుకోవాలని కోరారు.

ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. వాహనాల యజమానులు సరైన పత్రాలతో మొయినాబాద్ ఇన్స్‌స్పెక్టర్‌ను కలవాలని సూచించారు. వాహనాల యజమానులు ఆరు నెలలలోపు సంప్రదించాలని తెలిపారు. వాహనాలకు సంబంధించిన వివరాల కోసం ఎంటిఓ విష్ణును 9490517317లో సంప్రదించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News