Friday, December 20, 2024

స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను విస్మరిస్తున్నారు: సోనియా గాంధీ

- Advertisement -
- Advertisement -

వక్రీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నాం
సమర యోధుల త్యాగాలపై శీతకన్ను
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ
న్యూఢిల్లీ: స్వతంత్ర వజ్రోత్సవాల వేళ స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను విస్మరిస్తున్నారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. స్వాతంత్యం దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 75ఏళ్లుగా దేశం సాధించిన గొప్ప విజయాలపట్ల చిన్నచూపు తగదన్నారు.చరిత్రను వక్రీకరించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. కాగా దేశ విభజనలో జవహర్‌లాల్ నెహ్రూ పాత్ర ఏమిటని బిజెపి ప్రశ్నించిన మరుసటి రోజు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. స్వాతంత్య్రం కోసం సమర చేసిన గొప్ప త్యాగాలను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. గత 75ఏళ్ల కాలంలో మనం ఎంతో ప్రగతిని సాధించాం. ప్రస్తుత ప్రభుత్వం వాటిని అంగీకరించే స్థితిలో లేదని సోనియా విమర్శించారు. మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్‌పటేల్, మౌలానా ఆజాద్ వంటి గొప్ప జాతీయ నాయకులను కించపరిచే ప్రయత్నాలను ఖండిస్తున్నామన్నారు. ఈ మేరకు లిఖితపూర్వక సందేశాన్ని కాంగ్రెస్ విడుదల చేసింది.

అయితే సోనియా ప్రత్యేకంగా ఏపార్టీని ప్రకటనలో పేర్కొనకపోయినా బిజెపి సోషల్‌మీడియా విభాగం దేశవ్యాప్తంగా ఆదివారం విడుదల చేసిన వీడియో క్లిప్స్‌ను ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కరోనా నుంచి కోలుకుంటున్న సోనియా గాంధీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ.. దేశం గత 75ఏళ్లలో విద్య, ఆరోగ్య, సమాచార సాంకేతిక రంగాలతోపాటు అనేక రంగాల్లో గణనీయ ప్రగతిని సాధించిందన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేత, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్యూసి) సభ్యురాలు అంబికాసోనీ రాహుల్‌ గాంధీ సమక్షంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆజాదీ గౌరవ యాత్ర పేరిట నిర్వహించిన ర్యాలీలో ప్రియాంకాగాంధీ వాద్రా, గులాంనబీ అజాద్, ఆనంద్‌శర్మ, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

75th Independence Day: Sonia Gandhi hits out Centre

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News