Thursday, December 26, 2024

పిసిబి కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవం వేడుకలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /హైదరాబాద్ : 75వ గణతంత్ర దినోత్సవం వేడుకలు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం లో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ మేరకు 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి టిఎస్ పిసిబి చీఫ్ ఇంజనీర్ బి.రఘు బోర్డు ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన స్వాతంత్య్ర విశిష్టతను వివరిస్తూ పౌరులు ప్రస్తుతం అనుభవిస్తున్న అనేక అంశాల్లో స్వేచ్ఛ ఉందన్నారు. వేలాది మంది స్వాతంత్య్ర సమరయోధుల రక్తం, చెమటతో కూడిన పోరాటంతో ఇది సాధ్యమైందని, దేశం పట్ల అంకితభావం తోబాటు నిబద్ధత భావి తరాలకు ఉజ్వలమైన బాటలు వేసిన స్వాతంత్య్ర సమరయోధుల నుండి యువకులు స్ఫూర్తి పొందాలని కోరారు. గణతంత్ర దినోత్సవం రాజ్యాంగ స్థాపనను సూచిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో , అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News