Sunday, October 6, 2024

హిమాచల్‌లో 76 రహదార్ల మూసివేత

- Advertisement -
- Advertisement -

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండంతో 76 రహదారులను మూసివేశారు. వీటిలో 52 రహదారులు మండీలో ఉండగా, 13 సిర్‌మౌర్, 6 సిమ్లాలో ఉన్నాయి. రాష్ట్రంలో 10, 11 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

జులై 11 వరకు ఎల్లో అలర్డ్ జిజారీ చేసింది. గత 24 గంటల్లో సిమ్లా లోని రాంపుర్ బుషార్‌లో 33 మిమీ వర్షపాతం నమోదు కాగా, సర్హన్ జిల్లాలో 11ఎంఎం వంగ్టూ (కిన్నార్) 8 ఎంఎం చొప్పున నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలతో నదులు ఉప్పొంగుతున్నాయి. ప్రమాదకర పరిస్థితులు తలెత్తితే సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అధికార యంత్రాంగానికి ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News