Monday, December 23, 2024

ఎత్తుదాం వజ్రోత్సవ జెండా

- Advertisement -
- Advertisement -

స్వాతంత్య్ర భారతావని ముస్తాబు
నేడు ఎర్రకోటపై ప్రధాని మోడీ, గోల్కొండ కోటపై
సిఎం కెసిఆర్ జెండా ఆవిష్కరణ

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలకు యావత్ భారతావని సంసిద్ధమైంది. 75 ఏళ్ల జెండా ఇంటింటా జరుపుకునేందుకు ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు. ఆసేతు హిమాచలం అంగరంగ వైభవంగా వజ్రోత్సవానికి ఉత్సాహంగా తరలనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారంనాడు ఉదయం 7.30గంటలకు ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. అనంతరం కోట బురుజులపై నుంచి జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. ఉగ్రముప్పు పొంచివుందన్న ఐబి హెచ్చరికల నేపథ్యంలో హస్తినను భద్రతా బలగాలు, పోలీసులు జల్లెడ పట్టాయి. శత్రుదుర్బేధ్యంగా మార్చాయి. 10వేల మంది సిబ్బందితో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక రాడార్లతో నిఘా పెట్టారు. అవాంఛనీయ శక్తులను పసిగట్టేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. మరోవైపు హైదరాబాద్ కూడా వజ్రోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కెసిఆర్ గోల్కోండ కోటపై సరిగ్గా ఉదయం 10.30గంటలకు పోలీసుల గౌరవ స్వీకరించి మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ సందేశాన్నిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News