కర్తవ్యపథ్‌లో ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు
పరేడ్‌లో ఉట్టిపడిన సాంస్కృతిక వైభవం ప్రగతిని చాటిన శకటాలు
రాష్ట్రపతికి తొలిసారి మహిళా ఆర్మీ అధికారి శాల్యూట్ ప్రత్యేక ఆకర్షణగా ఐదువేల
మంది గిరిజన, జానపద కళాకారుల ప్రదర్శన మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించిన
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరైన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో
సుబియాంతో అలరించిన త్రివిధ దళాల ప్రదర్శన
న్యూఢిల్లీ : భారత 76 గణతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో మనదేశ సైనిక పాటవం, ఆయుధ శక్తి సు స్పష్టమైంది. కర్యవ్యపథ్‌లో జరిగిన పరేడ్‌లో భారతీయ సంస్కృతి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన ప్రగతితో పాటు, వివిధ రంగాల్లో సాధించిన ఘన విజయాలు ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబో వో సుబియాంతో సమక్షంలో తేటతెల్లం అయ్యా యి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాంప్రదాయ గు ర్రపు బగ్గీలో ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా వచ్చిన ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంతోతో కలిసి కర్తవ్య పథ్ చేరుకున్నారు. రాష్ట్రపతికి, సుబియాంతోకు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు ఘన స్వాగతం ప లికారు. త్రివిధ దళాల అధిపతులు, దౌత్య ప్రతినిధులు, సీనియర్ అధికారులు పెద్దఎత్తున ఆదివారంనాటి రిపబ్లిక్ డే పరేడ్ కు హాజరయ్యారు. వారికి విమాన శ్రేణి, త్రివర్ణపతాకం రెపరెపలాడుతుండగా, హెలికాప్టర్లు స్వాగతం సమర్పించాయి.
మొదట్లో దేశం వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన దాదాపు ఐదువేల మంది గిరిజన, జానపద కళాకారులు కనువిందు చేస్తూ,దాదాపు 45 విభిన్న నృ త్య రూపాలను ప్రదర్శించారు. అతిథులను అలరించారు. సంగీత నాటక అకాడమీ ఆవిష్కరించి న ‘జయతి జయ మమ భారతం’ అనే సాంస్కృతిక కార్యక్రమం 11 నిముషాల పాటు సాగింది. గిరిజన మహా నాయకుడు బిర్సా ముండాకు నివాళులర్పిస్తూ దేశ సాంస్కృతి, సంప్రదాయాలకు అ ద్దంపడుతూ ఈ ప్రదర్శన సాగింది. ప్రయాగ్ రాజ్ లో ఘనంగా జరుగుతున్న మహాకుంభ మేళాను గుర్తు చేస్తూ ప్రత్యేక శకటాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోటి కొప్పాక బొమ్మలతో కూడిన శకటం, వివిధ రాష్ట్రాలనుంచి వచ్చిన ప్రత్యేక శకటాలు, కేంద్ర మంత్రిత్వశాఖలు ఏర్పాటు చేసిన శకటాలు వరుసగా అలరించాయి. బుద్ధ భగవాను ని చిత్రంతో బీహార్ శకటం, కేంద్ర పునర్వినియో గ ఇంధన మంత్రిత్వశాఖ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అలరించిన త్రివిధ దళాల ప్రదర్శన
అనంతరం భారత రక్షణదళం పాటవ ప్రదర్శనలో బ్రహ్మోస్, పినాక, ఆకాశ్ తో సహా ఆస్త్ర సంపద, ఆర్మీ యుద్ధ పర్యవేక్షన వ్యవస్థ సంజయ్, డిఆర్ డీఓ రూపొందించిన ఉపరితలం నుంచి ఉపరితలంపై ప్రయోగించే ప్రళయ్ వ్యూహాత్మక క్షిపణులును తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రదర్శించారు. టి -90 భీష్మ యుద్ధ టాంక్ లు, ఆయుధ వాహక వాహనం శరద్, నాగ్ శిక్షణి వ్యవస్థ, రాకెట్ లాంచింగ్ వ్యవస్థ అగ్నిబాట్, బజ్ రంగ్, ఇతర ప్రత్యేక వాహన శ్రేణి పరేడ్ లో సాగాయి. ఈ రిపబ్లిక్ దినోత్సవ థీమ్ స్వర్ణిమ్ భారత్, విరాసత్, వికాస్‌ను ప్రతిబించిచే ప్రరదర్శన కర్తవ్యపథ్ లో సాగింది. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భం కూడా ఈ ఉ త్సవాలలో ప్రతిబింబించింది. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తే,, 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. సారే జహాసే అచ్చా.. అన్న గీతాన్ని వివిధ వాద్యాలతో వాయిస్తుండగా 300 మందికి పైగా సాంస్కృతిక కళాకారులు అతిథులను అలరిస్తూ.. పరేడ్ గా సాగారు. కార్గిల్ యుద్ధవీరులు- ఇద్దరు పరమ్ వీర్ చక్రా అవార్డు గ్రహీతలు, సుబేదార్ మేజర్, రిటైర్డ్ కెప్టెన్ యోగేంద్ర సింగ్ యా దవ్, సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్, అశో క్ చక్ర అవార్డు గ్రహీత లెఫ్టినెంట్ కల్నల్ జస్ రా మ్ సింగ్ ఈ పరేడ్‌లో పాల్గొనడం విశేషం. చివ ర్లో కెప్టెన్ అశిష్ రాణా నాయకత్వంలో డేర్ డెవి ల్స్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కెప్టన్ డిం పుల్ సింగ్ భట్టి ఆధ్వర్యంలో మరో ప్రదర్శన సా గింది. సైనిక జవాన్లు మోటర్ సైకిల్ పై విన్యాసా లు చేస్తూ.. మంత్ర ముగ్ధులను చేశారు. అంతకు ముందు ప్రధాని మోడీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర వీరులకు నివాళులు అర్పించారు.
ప్రత్యేక ఆకర్షణగా ప్రధాని తలపాగా!
ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం నాడు వే ర్వేరు రంగుల, స్టైళ్ల తలపాగాలతో చూపరులను ఆకట్టుకుంటున్నారు. ఈ సారి ఆయన పసుపు, ఎరుపు స్ట్రయిప్‌లు ఉన్న తలపాగ, పెద్ద గోధుమ రంగు జాకెట్‌తో అలరించారు. 76వ గణతంత్ర దినోత్సవం నాడు ఆయన తెల్లటి కుర్తా,పైజామా, తలపాగతో కనిపించారు. గత సంవత్సరం (2024) గణతంత్ర దినోత్సవం నాడు ఆయన బహురంగులు బంధనీ ప్రింట్ తలపాగ ధరించారు. బంధనీ తలపాగలను గుజరాత్, రాజస్థాన్‌ల లో విరివిగా వాడుతుంటారు. 2023లో మోడీ రాజస్థానీ బహురంగుల త లపాగను ధరించారు. 2019లో కూడా బహురంగుల తలపాగను ధరించారు. ఆయన తొలిసారి ప్రధాని అయిన 2014లో ఎర్రటి జోధ్‌పురి ‘బంధేజ్’ తలపాగను ధరించారు. 2015లో పసుపు రంగు తలపాగ, 2016 లో పింక్‌ఎల్లో తలపాగను ధరించారు. 2017లో పసుపు, ఎరుపు తలపాగను, 2018లో కాషాయ రంగు తలపాగను మోడీ ధరించారు. ప్ర తి గణతంత్ర దినోత్సవం నాడు ఆయన ధరించే వేర్వేరు తలపాగలు ప్రజల ను ఆకట్టుకుంటున్నాయి. 2022లో మాత్రం ఉత్తరాఖండ్‌కు చెందిన సాం ప్రదాయిక టోపీని ధరించారు. దానిపై బ్రహ్మకమలం గుర్తు ఉండింది.