Tuesday, December 24, 2024

బీహార్ షరీఫ్ హింసాత్మక సంఘటనలు… 77మంది అరెస్ట్

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్ లోని నలంద జిల్లా బీహార్ షరీఫ్ పట్టణంలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా తలెత్తిన మతపరమైన హింసాత్మక సంఘటనలకు సంబంధించి మొత్తం 77మంది అరెస్ట్ అయ్యారని పోలీసులు ఆదివారం వెల్లడించారు. బీహార్ షరీఫ్‌లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చి సాధారణ పరిస్థితి నెలకొందన్నారు. సంఘటనల ప్రాంతాల్లో పోలీస్ సీనియర్ ఆఫీసర్లు అక్కడ తిష్టవేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తగిన భద్రతా దళాలను అక్కడ నియమించారు. ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొందని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని పోలీస్‌లు కొట్టి పారేశారు.

అలాంటి వదంతులు నమ్మవద్దని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటనలకు బాధ్యులైన మిగతా దుండగుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. శనివారం రాత్రి తాజాగా మరికొన్ని సంఘటనలు జరగడంతో 144 సెక్షన్ విధించారు. శనివారం 45 మందిని అరెస్ట్ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ససరాం, బీహార్ షరీఫ్ పట్టణాల్లో మతపరమైన అల్లర్లు చెలరేగి ఇళ్లు, షాపులు, వాహనాలు తగుల బెట్టిన సంగతి తెలిసిందే. ససరాంలో కూడా 144 సెక్షన్ కింద జిల్లా యంత్రాంగం నిషేధాజ్ఞలు విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News