Tuesday, November 5, 2024

భద్రాచలంలో 77 కిలోల గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

77 KGs cannabis captured in Bhadradri

భద్రాద్రి:  భద్రాచలం పట్టణంలో భారీ మొత్తంలో నిషేధిత గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.  77 కిలోల గంజాయితో పాటు ఒక కారు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు రవాణా చేస్తున్న ఇద్దరు నిందితుల్ని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మర్రిపెడ బంగ్లాకు చెందిన  బానోతు హరి, గుండె పరుశురామ్ అనే వ్యక్తులు సీలేరు ప్రాంతంలో రాము అనే వ్యక్తి దగ్గర నుంచి 77 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. ఈ గంజాయిని బానోతు పాండు, హైదరాబాద్ కు చెందిన ప్రకాశ్ కు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. గంజాయిని తరలించేందుకు ఇద్దరు కలిసి బైక్ వెళ్తుండగా భద్రాచలం చెక్ పోస్టు ఎస్ఐ మధు ప్రసాద్, సిబ్బంది వారిని పట్టుకున్నారు. నిషేధిత గంజాయి విలువు 15 లక్షల రూపాయలు ఉంటుందని, తరలిస్తుండగా వారిని పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు.  హరి, పరుశురామ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుల వద్ద నుంచి కారు, మోటార్ సైకిల్, రెండు సెల్ ఫ్లోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి పట్టుకున్న భద్రాచలం సిఐ నాగరాజురెడ్డి, ఎస్ఐలు మధు ప్రసాద్, రాజేశ్ కుమార్ ను ఎఎస్పీ రోహిత్ రాజు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News