Wednesday, January 22, 2025

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఘనంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

జెండా ఎగరవేసిన కాసాని జ్ఞానేశ్వర్

మన తెలంగాణ / హైదరాబాద్ : 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా టి టిడిపి అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఈ మేరకు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ స్వాతంత్య్రం రాకముందు మన పరిస్థితి ఎలా ఉండేది..? స్వాతంత్య్ర వచ్చిన తర్వాత ఎలా ఉందన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. మహానుభావులు స్వాతంత్య్రం సాధించి పెట్టడం వల్ల మనమందరం ఈ రోజు స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్నామన్నారు.

తెలుగుదేశం పార్టీ ఆవిష్కరించాక దేశప్రజలమైన మనం రెండు ముఖ్య వేడకలు అయిన ఆగష్టు 15, జనవరి 26ను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్నామన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తూ ముందుకు వెళ్లాలని ఆయన పిలుపు నిచ్చారు. ఆ దిశగా టిడిపి యువతరం ముందుకు రావాలన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు 77వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు జక్కిలి ఐలయ్య యాదవ్, అజ్మీరా రాజునాయక్, గడ్డి పద్మావతి, షేక్ ఆరిఫ్, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులు బుగిడి అనూప్ కుమార్, ముప్పిడి గోపాల్, సూర్యదేవర లత, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులు పెద్దోజు రవీంద్రాచారి, వేజెండ్ల కిశోర్ బాబు, సంధ్య పోగు రాజశేఖర్, సైదేశ్వర్ రావు, మండూరి సాంబశివరావు, భిక్షపతి ముదిరాజ్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కట్టా రాములు, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీపతి సతీష్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పోలంపల్లి అశోక్, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు రఘువర్థన్ ప్రతాప్, తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గజేంద్రగౌడ్, మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు హబీబ్ మహ్మద్, మల్కాజిగిరి పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కందికంటి అశోక్ కుమార్ గౌడ్, మంథని నియోజకవర్గ ఇన్‌ఛార్జీ మాదాడి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News