పార్లమెంట్ ఉభయ సభల నుంచి విపక్షాల ఎంపిల బహిష్కరణ
ఇంతపెద్ద సంఖ్యలో సస్పెండ్ చేయడం పార్లమెంట్ చరిత్రలో ఇదే తొలిసారి
విపక్షాల సభ్యుల దురుసు ప్రవర్తనపై సభాధ్యక్షుల ఆగ్రహం
రాజ్యసభలో 45.. లోక్‌సభలో 33మంది ఎంపిల సస్పెన్షన్
వీరిలో 66మంది శీతాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్‌లోనే..
16మందిపై సభా హక్కుల కమిటీ విచారణ
న్యూఢిల్లీ: భారత పార్లమెంట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఒకేరోజు 78 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రతిపక్షం లేని పార్లమెంట్‌లో ముఖ్యమైన బిల్లులను ఇష్టారీతిగా ఆమోదించప చేసుకోవడానికే బిజెపి ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందని, కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. పార్లమెంట్‌లో ఈ నెల 13న చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మం త్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీల నినాదాలతో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం దద్దరిల్లాయి. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నందుకు ఉభయ సభలకు చెందిన దాదాపు 78 మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలను సంబంధిత సభాధ్యక్షులు సభ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఇదే అంశంపై గత గురువారం నుంచి పార్లమెంట్ ఉభయ సభలలో సస్పెన్షన్‌కు గురైన ప్రతిపక్ష ఎంపీల సంఖ్య 92కి చేరుకుంది. రాజ్యసభలో 45 మంది స భ్యులు సస్పెండ్ కాగా లోక్‌సభలో 33 మంది ప్రతిపక్ష ఎంపీలు సోమవారం సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై నినాదాలు చేస్తూ, సభా కార్యకలాపాలను అడ్డుకున్న ప్రతిపక్ష ఎంపీల దుష్ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజ్యసభ చైర్మన్ 45 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు.
రాజ్యసభలో రభస
సస్పెన్షన్‌కు ఐనవారిలో కాంగ్రెస్ ఎంపీలు ప్రమోద్ తివారీ, జైరాం రమేష్, కెసి వేణుగోపా, రణదీప్ సింగ్ జుర్జీవాలా, సమాజ్‌వాది పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ తదితరలున్నారు. లోక్‌సభలో సస్పెం డ్ అయిన ఎంపీలలో కాంగ్రెస్ సభాపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, డిఎంకె ఎంపి టిఆర్ బాలు, టిఎంసి ఎంపి సౌగతా రాయ్ తదితరలు ఉన్నారు. రాజ్యస ఎంపీలలో 34 మందిని శీతాకాల సమావేశాల పూర్తయ్యేవరకు సభ నుంచి సస్పెండ్ చేయగా మిగిలిన 11 మంది ఎంపీలను వారి ప్రవర్తనపై సభా హక్కుల కమిటీ దర్యాప్తు పూర్తయ్యేవరకు సస్పెండ్ చేశారు. రాజ్యసభలో బిజెపి పక్ష నాయకుడు పీయుష్ గోయల్ రెండు తీర్మానాలను సభలో ప్రవేశపెట్టి ఆమోదించడంతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన 45 మంది ఎంపీలస్చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ సస్పెన్ష న్ వేటు వేశారు. 11 మంది ఎంపీలపై సభా హక్కుల కమిటీ విచారణ జరిపి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని, అప్పటి వరకు సమావేశాలకు వారు దూరంగా ఉండాలని చైర్మన్ ఆదేశించారు. సస్పెన్షన్‌కు గురైన సభ్యుల పేర్లను మొదట చదివి వినిపించిన చైర్మన్ ధన్‌ఖర్ అనంతరం తీర్మానాన్ని ఓటింగ్‌కు ప్రవేశపెట్టారు. సభ్యుల మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందించింది. శీతాకాల సమావేశాలు ఈనెల 22న ముగియనున్నాయి. శీతాకాల సమావేశాల వరకు సస్పెన్షన్‌కు గురైన ఎంపీలలో 12 మంది కాంగ్రెస్‌కు చెఇందిన ఎంపీలు ఉన్నారు.
లోక్‌సభ రచ్చ రచ్చ
లోక్‌సభలో సస్పెన్షన్‌కు గురైన ప్రతిపక్ష ఎంపీలలో డిఎంకె ఎంపీలు 10 మంది, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు 9 మంది, కాంగ్రెస్‌నుంచి 8 మంది, ఐయుఎంల్, జెడి(యు), ఆర్‌ఎస్‌పి ఎంపీలు ఒక్కరేసి చొప్పున ఉన్నారు. మరో ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలను సభా హక్కుల కమిటీ విచారణ నివేదిక వచ్చే వరకు సస్పెండ్ చేశారు. స్పీకర్ పోడియం ఎక్కి నినాదాలు చేసినందుకు కాంగ్రెస్ ఎంపీలు జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలేఖ్‌పై సహా హక్కుల కమిటీ విచారణకు స్పీకర్ ఓం బిర్లా ఆదేశించారు. అప్పటి వరకు వీరి సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి 30 మంది సభ్యులను సస్పెండ్ చేసే తీర్మానాన్ని సభలో చదివి వినిపించారు. వీరిని శీతాకాల సమావేశాల ముగింపు వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
పార్లమెంట్ చరిత్రలో తొలిసారి…
ప్రతిపక్ష ఎంపీల మూక్ముడి సస్పెన్షన్‌లు గతంలో కనీవినీ ఎరుగనివని, ఇలా జరగడం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారని పార్లమెంట్ పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఒకే రోజున 78 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం అనూహ్యమని పార్లమెంటరీ కార్యకలాపాల నిశిత పరిశీలకుడు, చట్టసభల నిపుణుడు జి రవీంద్ర అన్నారు. 1989లో లోక్‌సభ నుంచి 63 మంది సభ్యులను సస్పెండ్ చేయడం జరిగింది. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యపై దర్యాప్తు జరిపిన జస్టిస్ ఠక్కర్ కమిటీ నివేదికను లోక్‌సభలో ప్రవేశపెట్టడంపై మార్చి 15 నుంచి ఆ వారంలో మిగిలిన రోజులకు సమావేశాల నుంచి 63 మంది సభ్యులను సస్పెండ్ చేశారు. 2015లో సభ మధ్యలోకి చొరబడి ప్లకార్డులతో నిరసన తెలియచేసినందుకు 25 మంది కాంగ్రెస్ సభ్యులను మిగిలిన ఐదు పనిదినాల వరకు అప్పటి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెండ్ చేశారు. 15వ లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంశంపై పలువురు కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభ నుంచి సస్పెండ్ అయ్యారు.
పోస్టాఫీస్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
125 ఏళ్ల నాటి పాత భారత పోస్టాఫీస్ చట్టాన్ని రద్దు చేసి సవరించిన సరళీకృత పోస్టాఫీస్ బిల్లుకు పార్లమెంట్ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు సంబంధించిన కార్యనిర్వాహక ప్రక్రియను, భారత పోస్టాఫీస్ వ్యవస్థ పరిణామాన్ని కొత్త బిల్లు ద్వారా సరళీకృతం చేశారు. పౌర కేంద్రీకృత సర్వీస్ నెట్‌వర్క్‌గా సవరించారు. పోస్టాఫీస్ బిల్లు 2023ను రాజ్యసభ డిసెంబర్ 4న ఆమోదించింది. పార్లమెంట్ భద్ర తా వైఫల్యంపై సభ్యుల నిరసనల మధ్య లోక్‌సభ స్వ ల్ప చర్చల మధ్య డిసెంబర్ 13న ఆమోదించింది.