Sunday, January 19, 2025

హైదరాబాద్ న్యూఢిల్లీ మధ్య 78 రైళ్ళు రద్దు

- Advertisement -
- Advertisement -

దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్- న్యూఢిల్లీ మధ్య పలు రైళ్లను రద్దు చేసింది. ఈ రెండు నగరాల మధ్య మొత్తం 78 రైళ్ల రాకపోకలను రద్దు చేసింది. మ రో 36 రైళ్లను దారి మళ్లిస్తోంది. జూన్ 27 నుంచి జూలై 7 వరకు ఈ రైళ్ల రాకపోకల రద్దు కొనసాగుతుంది. కాజీపేట, బలార్షా సెక్షన్ల మధ్య మూడో లైన్ నిర్మాణం జరుగుతుండటంతో రైళ్లను రద్దు చేసింది. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని ఆసిఫాబాద్, రెచ్ని స్టేషన్ల మధ్య కొత్తగా మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఈ రైళ్ల రద్దు, దారి మళ్లింపు కొన సాగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ రూట్ లో రైల్వే నెట్ వర్క్ సామర్థ్యం పెంచడం వంటి మౌలిక సదుపాయాల ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.

రద్దు చేయబడిన రైళ్ల వివరాలు
రైలు నం. 17003: కాజీపేట్- సోలాపూర్ ఎక్స్ప్రెస్
రైలు నం. 17004: బల్హర్షా-కాజీపేట ఎక్స్ప్రెస్
రైలు నెం. 12757: సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ ఎక్స్ప్రెస్
రైలు నెం. 12758: సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్
రైలు నెం. 20805:విశాఖపట్నం-న్యూఢిల్లీ
రైలు నెం. 20806:న్యూ ఢిల్లీ-విశాఖపట్నం
రైలు నెం. 12803: విశాఖపట్నం-నిజాముద్దీన్
రైలు నెం. 12804: నిజాముద్దీన్-విశాఖపట్నం

దారి మళ్లించిన రైళ్ల వివరాలు
రైలు నెం. 12590: సికింద్రాబాద్- గోరఖ్‌పూర్ (మజ్రీ, పింపాల్, ఖుతీ, ముద్ఖేడ్ , నిజామాబాద్ మీదుగా మళ్లించబడింది)
రైలు నం. 12589: గోరఖ్‌పూర్- సికింద్రాబాద్ (మజ్రీ, పింపాల్, ఖుతీ, ముద్ఖేడ్ , నిజామాబాద్ మీదుగా మళ్లించబడింది)
రైలు నెం. 12723: సికింద్రాబాద్-న్యూ ఢిల్లీ (మజ్రీ, పింపాల్, ఖుతీ, ముద్ఖేడ్ , నిజామాబాద్ మీదుగా మళ్లించబడింది)
రైలు నెం. 12724: న్యూఢిల్లీ-సికింద్రాబాద్ (మజ్రీ, పింపాల్, ఖుతీ, ముద్ఖేడ్ , నిజామాబాద్ మీదుగా మళ్లించబడింది)
రైలు నెం. 12723: హైదరాబాద్-న్యూ ఢిల్లీ (నిర్దిష్ట రోజుల్లో ఒక గంట రీషెడ్యూల్ చేయబడింది)
రైలు నం. 12724: న్యూఢిల్లీ-హైదరాబాద్ (నిర్దిష్ట రోజుల్లో రెండు గంటలు రీషెడ్యూల్ చేయబడింది)
రైలు నం. 12791: సికింద్రాబాద్-దానాపూర్ (జూలై 4 నుండి 6 వరకు 75 నిమిషాలు రీషెడ్యూల్ చేయబడింది)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News