Monday, December 23, 2024

ఐదేళ్లలో 7,800 ఉద్యోగాలు ఎఐతో భర్తీ

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : టెక్ కంపెనీ ఐబిఎం(ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్ప్) తాత్కాలికంగా నియామకాలను నిలిపివేయాలని యోచిస్తోంది. అదే సమయంలో ఎఐ ఉద్యోగాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈమేరకు కంపెనీ సిఇఒ అరవింద్ కృష్ణ బ్లూమ్‌బెర్గ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కంపెనీ ప్లాన్‌ను వెల్లడించారు.

రాబోయే సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ) ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయాలని భావిస్తున్నట్లు అరవింద్ వెల్లడించారు. ఇది ప్రాథమికంగా మానవ వనరులు, పరిపాలన వంటి బ్యాక్- ఆఫీస్ విధులు ఉన్న ఉద్యోగులను ప్రభావితం చేస్తుంది. అరవింద్ మాట్లాడుతూ ప్రస్తుతం కంపెనీలో 26,000 మంది ఉద్యోగులు నాన్‌కస్టమర్ ఫేసింగ్ రోల్స్‌లో ఉన్నారు. రాబోయే 5 సంవత్సరాలలో 30 శాతం మంది ఉద్యోగులను ఎఐ, ఆటోమేషన్ ద్వారా భర్తీ చేయాలని ప్లాన్ చేస్తున్నామని అన్నారు.

అంటే ఐబిఎం దాదాపు 7800 మంది ఉద్యోగులను ఎఐతో భర్తీ చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఐబిఎంలో దాదాపు 2.6 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కస్టమర్ ఫేసింగ్ పాత్రల కోసం కంపెనీ నిరంతరం ఉద్యోగులను నియమిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 7000 మందిని కంపెనీలో నియమించినట్లు సిఇఒ అరవింద్ కృష్ణ తెలిపారు. ఐబిఎం ఈ సంవత్సరం మొదటి నెల జనవరిలో మొత్తం గ్లోబల్ వర్క్ ఫోర్స్ నుండి 3,900 మంది ఉద్యోగులను తొలగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News