Thursday, December 5, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లోదుస్తుల్లో దాచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో ఇండిగో విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 785 గ్రాముల అక్రమ బంగారాన్ని గుర్తించిన అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అధికారులు ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. మార్కెట్లో ఈ బంగారం విలువ రూ.47.49లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారించనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News