Wednesday, December 25, 2024

ఖమ్మం జిల్లా గురుకుల విద్యార్థికి జాతీయ గౌరవం

- Advertisement -
- Advertisement -

దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఖమ్మం గురుకుల విద్యార్థిని వి గ్రేషితకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఎర్రకోట వేడులకు రావాలని పిలుపు వెలువడింది. రైతులు, అంగన్వాడి కార్యకర్తలు, సామాజిక ఉద్యమకారులకు పంద్రాగస్టు వేడుకలలో పాల్గొనేందుకు ఆహ్వానాలు వెలువడ్డాయి. ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి తెలంగాణ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువున్న బాలిక గ్రేషితకు రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందడం పట్ల స్థానికులు,

ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కాగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయురాలు కూర సుజాతకు, మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాన్‌పూర్ నివాసి శశాంక్ విశ్వనాథ్‌కు కూడా 15వ ఆగస్టు ఉత్సవాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా వర్తమానం అందింది. దీనితో ఆయా ప్రాంతాల వారు సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి ఖమ్మంలోని పలు గురుకుల పాఠశాలల్లో పండుగ వాతావరణం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News